వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులు వరుస మరణాలతో సిబిఐ దిక్కుతోచని స్థితిలో పడింది. విచారణ మందకొడిగా సాగుతొందని ఒక పక్క వైఎస్ సునీత చెబుతుండగా , మరో పక్క ఒకరొకరుగా సాక్షులు చనిపోవడం వింతగా ఉంది. దీని వెనుక మిస్టరీ కూడా ఛేదించలేని పరిస్థితి. ఈ కేసులో కీలక సాక్షి వాచ్ మెన్ రంగన్న తాజాగా చనిపోయాడు.
గతంలో సాక్షలుగా ఉన్న వైఎస్ అభిషేక్ రెడ్డి, మరో యువకుడు గంగాధరరెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. మృతులు ఇద్దరూ పిన్న వయస్కులే. ఆరోగ్య సమస్యలు లేకుండా , ఒక్కసారిగా అనారోగ్యంతో చనిపోయారు. శ్రీనివాసులరెడ్డి అనే వ్యక్తి కూడా ఈ కేసులో సాక్షిగా ఉంటూ మరణించాడు, అతడు కూడా విషం తాగి మరణించినట్టు పేర్కొన్నారు. ఒక హత్యకేసులో సాక్షులుగా ఉన్నవారు ఇలా చనిపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది..

