22.5 C
New York
Saturday, June 13, 2026

Latest Posts

ఫోన్ టాపింగ్ బాధితులు 600 మందికి పైగానే..

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ పుట్టలో పాములు బయటకు వస్తున్నాయి. కొండవీటి చాంతాడులా ఫోన్ టాపింగ్ బాధితుల లిస్ట్ పెరిగిపోతొంది. ఈ కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. 2023 ఎన్నికలకు రెండు నెలల ముందు అధిక సంఖ్యలో ఫోన్లు ట్యాప్‌ చేసినట్టు సిట్‌ గుర్తించింది. ఇప్పటి వరకు దాదాపు 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్‌ అయ్యాయని అధికారుల దర్యాప్తులో తేలింది. బాధితుల్లో జర్నలిస్టులు, సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు ఉన్నారు.

అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సన్నిహితులు గాలి అనిల్, వినయ్‌ రెడ్డిల ఫోన్‌లు ట్యాప్ చేసి స్వాధీనం చేసుకున్న డబ్బుపై కూడా సిట్‌ ఆరా తీసింది. పొంగులేటి, రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీల డబ్బును ఫోన్లు ట్యాప్ చేసి టాస్క్ ఫోర్స్ ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. 2023 ఎన్నికల సమయంలో ట్యాపింగ్ బాధితుల్లో భారాస నేతలు కూడా ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి ఫోన్లు ట్యాప్ చేశారని సిట్‌ ఇప్పటికే ఆధారాలు సేకరించింది.

ప్రతి రోజు ఉదయం 2గంటల పాటు ప్రభాకర్‌రావు తమకు బ్రీఫింగ్‌ ఇచ్చే వారని నలుగురు నిందితులు సిట్‌ అధికారులకు తెలిపారు. పోల్‌-2023 వాట్సాప్ గ్రూప్‌పై ప్రధానంగా ప్రభాకర్ రావును సిట్‌ ప్రశ్నించనుంది. ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులు ఒక్కొక్కరుగా జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు వచ్చి వాంగ్మూలం ఇస్తున్నారు. బాధితులు చెప్పిన వివరాల మేరకు ప్రభాకర్‌రావుతో పాటు నలుగురు నిందితులను కూడా కలిపి విచారించాలని సిట్‌ భావిస్తోంది.

 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.