22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

ఏడాదిలో ట్రాఫిక్ ఫైన్స్ 12 వేలకోట్లు .

మన దేశంలో ట్రాఫిక్ అంటే కీకారణ్యమే.. చెప్పేందుకే నీతులు అన్నట్టు ట్రాఫిక్ రూల్స్ ఎన్ని ఉన్నా ఆచరించడంలో , పౌరులు, పోలీసులు, అధికారులు, నాయకులవరకూ అందరూ దఫాలు రూల్స్ బ్రేక్ చేసిన వారే.. ట్రాఫిక్ పెరుగుతున్నా , ఆక్రమణలు తొలగించలేని అసహాయత , ఇరుకైన రోడ్లు, వాహనాలకు అనుగుణంగా లేని రోడ్లు.. లంచగొండితనం, నిర్లక్ష్యం ఇవన్నీ కలిపి మనదేశంలో ట్రాఫిక్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసాయి. బెంగుళూరు, హైదరాబాద్, ముంబై ..ఇలా అనేక నగరాలు , పట్టణాలు ట్రాఫిక్ కీకారణ్యాలే. మీకో విష్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

దేశంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద 2024 సంవత్సరంలో 12 వేల కోట్ల రూపాయలు ఫైన్స్ వేశారు.. ఇది పచ్చినిజం.. నమ్మలేని సత్యం. ఎనిమిది కోట్ల చలానాలకు సంబంధించి ఈ ఫైన్స్ వేశారు. అంటే పోలీసులు 8 కోట్ల ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు పెట్టారు. లెక్కలోలేనివి ఇంతకూ పదింతలు ఉంటాయి.

అయితే 12 వేలకోట్ల జరీమానాలో వసూలైంది ఎంతో తెలుసా..? మూడు వేలకోట్లు రూపాయలు.. మిగిలిన 9 వేలకోట్లు వసూలు కావాల్సివుంది.. ట్రాఫిక్ ఉల్లంఘన కింద వేసిన 12 వేలకోట్ల రూపాయల జరీమానా ఒక చిన్న దేశంలో జాతీయోత్పత్తితో సమానం.. దీన్ని బట్టి మన నగరాలలో రోడ్ల దుస్థితి, ట్రాఫిక్ పరిస్థితి ఎంత అస్తవ్యస్తమో స్పష్టం అవుతొంది..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.