మహిళలు ఇల్లు చక్కదిద్దుకునే విధానం ,ఇంటిని పొదుపుగా నడుపుకునే పద్ధతి ,పొదుపులో వారు అవలంబించే ట్రిక్కులు, లెక్కలు .. ఇవన్నీ కూడా తరచి చూస్తే ఆసక్తిగా ఉంటాయి. బిజినెస్ మేనేజ్మెంట్ చదివే విద్యార్థులకు వీటిని కూడా నేర్పిస్తారు. మహిళల చేత లెక్చర్లు కూడా ఇప్పిస్తారు .ఇప్పుడు గత కొంతకాలంగా రాచెల్ కౌర్ అనే మహిళ పిల్లల్ని చదివించుకుంటూ వారి ఆలనా, పాలనా చూసుకుంటూ ఇంటి బాధ్యతలను, తన ఉద్యోగ విధులను సమర్ధవంతంగా ఎలా పనిచేస్తుందో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. తన పిల్లల జీవితాన్ని , తన కుటుంబ జీవితాన్ని, ఉద్యోగ ధర్మాన్ని సమర్థవంతంగా నెట్టుకొస్తోంది. కాపురం నెట్టుకొచ్చేందుకు మహిళా ఉద్యోగి ఎంత కష్టపడుతుందో ఆమె ఒక నిదర్శనంగా నిలిచింది . మలేషియాలోని పెనాంగ్ అనే ప్రాంతంలో ఉన్న ఈ మహిళ తన ఉద్యోగానికి ప్రతిరోజు విమానంలోనే పోతుంది . ఒక ఉద్యోగి ప్రతిరోజు విమానంలో పోవడం అంటే ఇదేదో రైల్లో, బస్సు స్కూటీ కాదు. ఏకంగా విమానంలోనే.
ఉద్యోగానికి విమానంలోనే డైలీ ట్రావెల్
ఆమె పెనాగ్ నుంచి కౌలాలంపూర్ కి రోజు ప్రయాణంచేసేందుకు ఉదయాన్నే నాలుగు గంటలకు లేస్తుంది. ఆసియన్ ఎయిర్ లో పనిచేసే రాచల్ కౌర్ ఐదున్నర కల్లా తన పనులన్నీ ముగించుకుని పిల్లల్ని ముస్తాబు చేసి ఆరు గంటలకు పిల్లల్ని స్కూల్లో వదిలేసి , ఫ్లైట్లో కౌలాలంపూర్ పోతుంది . అక్కడ ఉద్యోగం ముగించుకుని మళ్ళీ ఆరు గంటలకు విమానంలో పెనాంగ్ కు వచ్చేసి , పిల్లలని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తుంది. ఆ తర్వాత ఇంటి బాగోగులను చూసుకుంటుంది . ఇందులో మీకు అనుమానం రావచ్చు రోజూ విమానంలో పోయే ఆమె జీతం ఎంత అని.. ఆమెకు పెద్ద జీతం కాదు . ఎయిర్ ఆసియాలో పనిచేసినంత మాత్రాన ఆమెకు ఆమె టికెట్ కొనుక్కొని పోవాలి . అయితే ఇందులో ఓ కిటుకు ఉంది. ఓ పొదుపు మంత్రం ఉంది .అదే బిజినెస్ మేనేజ్మెంట్ లో మహిళల సమర్థత . ఇంటి నిర్వహణలో మహిళల సామర్థ్యం .
విమాన ప్రయాణం , అదొక్కటేచాలా చౌక
కౌలాలంపూర్ లో కాపురం ఉంటే ఇంటి అద్దె ఆమెకు కనీసం నెలకు ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 50 వేలరూపాయలు ఆవుతుంది. అదే పెనాంగ్ లో అయితే 20 వేల రూపాయలకే ఇల్లు అద్దెకు వస్తుంది . పిల్లల స్కూల్ ఫీజులు కౌలాలంపూర్ లో కనీసం నెలకు 20 వేలు, పెనాంగ్ లో అయితే నెలకు రెండు వేలు.. ఇలా ప్రతి ఒక్కటి పెనాంగ్ లో చౌక..విమాన ప్రయాణం కూడా, అదొక్కటేచాలా చౌక . ఎందుకంటే టూరిస్ట్ కేంద్రాలు కాబట్టి , మలేషియాలో చాలా నగరాలకు విమాన ప్రయాణం చౌకగానే కాకుండా , విదేశీ టూరిస్టులకు ఉచితంగా కూడా ఉంటుంది. మిగతా ఖర్చులు అన్నీ కూడా తన జీతంతో కలుపుకుంటే కౌలాలంపూర్ లో జీవనానికి ,పెనాంగ్ జీవనానికి చాలా తేడా ఉంటుంది .. అందువల్ల ఆమె తన పిల్లలను చదివించుకునేందుకు ఒక బాధ్యత ఒక బాధ్యత కలిగిన ఇల్లాలుగా ఉద్యోగం చేస్తూ, వీటన్నింటికీ మించి తనకొచ్చే జీతాన్ని ఒక పద్ధతిలో పొదుపు చేసుకునేందుకు విమానంలో రోజూ ట్రావెల్ చేస్తుంటారు .
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

