22.5 C
New York
Tuesday, June 2, 2026

Latest Posts

ఏపీ తెలంగాణలో హైఅలర్ట్ జోన్స్ ఇవే..

కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో దేశం మొత్తం ప్రధానమైన పట్టణాలలో దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలలో సెక్యూరిటీని అప్రమత్తం చేశారు.. ప్రజలకు కూడా మార్గదర్శక సూత్రాలను జారీ చేశారు . దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని 14వ ప్రాంతాలను హై అలర్ట్ జోన్లుగా ప్రకటించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయి . ఆయా ప్రాంతాలకు ఆక్టోపస్ బృందాలు రక్షణ కోసం వెళ్తాయి. అదనంగా అక్కడ భద్రత కల్పిస్తారు . ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో హై సెక్యూరిటీ జోన్స్ ఇలా ఉన్నాయి.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ తిరుమల మరియు అలిపిరి తిరుపతి విశాఖపట్నం రైల్వే స్టేషన్ విశాఖపట్నం రామకృష్ణ బీచ్ హైదరాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ , నాంపల్లి హైదరాబాద్ ,మహాత్మా గాంధీ బస్ స్టేషన్ హైదరాబాద్, ట్యాంక్ బండ్, విశాఖపట్నం జగదాంబ జంక్షన్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ ఎంజీ రోడ్డు ఈ ప్రాంతాల్లో సెక్యూరిటీ అప్రమత్తం చేసారు.

ఈ ప్రాంతాలకు పౌరులు అనవసరంగా పోవద్దని ,అవసరమైతేనే ఈ ప్రాంతాలకు పర్యటించాలని కేంద్రం సలహా ఇచ్చింది . ఈ ప్రాంతాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో పర్యటించాలనుకున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితే తప్ప ఆ ప్రాంతాలకు పోవద్దని ,ఒకవేళ ఆ ప్రాంతాల్లో తిరిగినా అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.