భిన్న సంస్కృతులు ,విభిన్న సంప్రదాయాలు, రకరకాల ఆచార వ్యవహారాలు ఉన్న మన దేశంలో ఒకే యువతని ఇద్దరు అన్నదమ్ములు పెళ్లాడడం అనేది కొన్ని తెగల్లో తరతరాలుగా ఆచారంగా వస్తుంది. అలాంటిదే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది. హిమాచల్ ప్రదేశ్ లో షీలై అనే గ్రామంలో గిరిజన తెగకు చెందిన అన్నదమ్ములైన యువకులు ఒకే అమ్మాయిని పెళ్లాడారు. పెళ్లి అత్యంత సాంప్రదాయంగా , వైభవంగా జరిగింది. ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెండ్లాడడం అనేది షిల్లై తెగలో సర్వసాధారణంగా జరిగే విషయం. అయితే ఇప్పుడు దీనిని పబ్లిక్ వేడుకగా చేసారు.
తమ తెగ ఆచారాలను బయట ప్రపంచానికి చెప్పాలని ఇలా చేశామని పెళ్లికొడుకులు ఇద్దరూ చెప్పారు. యువతి అంగీకారంతోనే ఈ పెళ్లి జరుగుతుంది . హిమాచల్ ప్రదేశ్ లో షీలాయి అనే గ్రామంలో జరిగిన ఈ వివాహానికి వందలాది మంది హాజరై వధూవరులను ఆశీర్వదించారు . వధువు పేరు సునీత చౌహన్. పెళ్లికొడుకులిద్దరూ ప్రదీప్ మరియు కపిల్ నేగి . ఇద్దరూ అన్నదమ్ములే. ఒకే అమ్మాయిని పెళ్లాడారు. ఒకే యువతిని ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవడం తమకు గర్వకారణంగా ఉందని ,తమ తెగ ఆచారాలను సంప్రదాయాలను తాము వదులుకోమని వారిద్దరూ చెబుతున్నారు. ఇందులో ఎవరి ఒత్తిడి లేదని వధువు కూడా సంతోషంగానే అంగీకరించిందని తెలిపారు.
ఒకే అమ్మాయిని పెళ్లిచేసుకున్న అన్నదమ్ముల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగికాగా , మరొకరు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇలాంటి పెళ్లివల్ల తమ కుటుంబం చీలిపోకుండా మరో రెండు తరాలకు కలిసేవుంటుందని పెళ్లికొడుకులు చెప్పారు. కుటుంబంలో కలతలు, కలహాలు ఉండకూడదనే , తమ తెగలో ఒకే అమ్మాయిని ఇద్దరు అన్నదమ్ములు చేసుకుంటారన్నారు. ముగ్గురున్నా , ముగ్గురూ కలిసే ఒక అమ్మాయిని చేసుకుంటామని అన్నారు. స్థానిక గిరిజనులు ఈ పెళ్లి సందర్భంగా నృత్యాలు డప్పులు మోతలతో సందడి చేశారు .మూడు రోజులు పాటు ఈ పెళ్లి వేడుక జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో రెవెన్యూ చట్టాలు కూడా దీనిని గుర్తిస్తున్నాయి .

