ఉద్యమాల్లో రాటుదేలిన వాళ్ళు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటాయో ,నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఉదాహరణ. తన క్రియాశీలక రాజకీయ ప్రారంభ దశలో గడపగడపకు మీ బిడ్డ అంటూ రాజకీయ నినాదాన్ని తీసుకెళ్లి ప్రతి గడప తొక్కి , ప్రతి తలుపు తట్టి , ప్రజలకు చేరువై ఎన్నికల్లో మొదటి విజయాన్ని దక్కించుకున్నారు.ఆ చరిత్ర ఆ తర్వాత చాలామంది ఎమ్మెల్యేలకు మార్గదర్శనమైంది. ఆ తర్వాత కార్యకర్తలు ప్రజలతో నేరుగా సంబంధాల ద్వారా రాజకీయంలో మరో కొత్త విధానానికి బీజం వేశారు. తనకూ, ప్రజలకూ మధ్య మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించారు . ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో శత్రువు అన్న మాట వినపడకూడదని చెప్పేవారు. ఎన్నికల తరువాత అందరూ మిత్రులేనని ,అందరినీ కలుపుకుపోతేనే అభివృద్ధి సాధ్యమని కార్యకకర్తలకు ఉద్బోధించారు. కక్షలైనా , కార్పణ్యాలైనా , రాజకీయాలైనా ఎన్నికల వరకే పరిమితమంటూ కొత్త నినాదాన్ని తీసుకొని పోతూ రాజకీయాల్లో కొత్త శకాన్ని ఒక కొత్త విధానాన్ని ఆవిష్కరించారు .
అదే ఇప్పుడు నెల్లూరు నియోజకవర్గంలో ఒక విధానమైంది.. దీనికి నిదర్శనమే నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని చింతా రెడ్డిపాలెం గ్రామంలో అంగన్వాడీ ప్రారంభోత్సవానికి ఆయన రూపాందించిన కార్యక్రమం. అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవం ముఖ్యఅతిథిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మను ఆహ్వానించారు. తనే స్వయంగా ఫోన్ చేసి ఆమెను ఈ కార్యక్రమానికి రావలసిందిగా ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సిందిగా అంగన్వాడిని కూడా తనే ప్రారంభించాల్సిందిగా కూడా కోరారు .ఆనం అరుణమ్మ భర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రస్తుతం రాజకీయ బద్ధ శత్రువు . తీవ్రమైన పరుష పదజాలంతో ఆనం , ఎమ్మెల్యేపై విరుచుకుపడుతుంటారు . తనతో విభేదించి వైసిపి తో చేతులు కలిపిన ఒకప్పటి తన స్వంత మనిషి నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతిని కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు .ఆమెకు కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం పెద్ద పీట వేయాల్సిందిగా అధికారులు కోరి ఆ మేరకు శిలాఫలకం పైన పేర్లు కూడా చెక్కించారు.
ప్రారంబోత్సవాలలో , శంకుస్తాపనలలో ప్రోటోకాల్ పద్ధతి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన నుంచి దాదాపుగా లేదని చెప్పాలి . ప్రజలతో సంబంధం లేని ఇన్చార్జిల పేర్లను ప్రోటోకాల్ లో చేర్చి వారి చేత ప్రారంభోత్సవాలు చేయించడం జరిగేది. గతంలో శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా వైసిపికి దూరం జరిగిన తరువాత , ఆయనను ఒక్క కార్యక్రమానికి కూడా పిలవలేదు. అప్పటి ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉద్యోగిగా ఉండే రంగారెడ్డి కూడా , నగరంలో శంకుస్తాపనలు , ప్రారంభోత్సవాలు చేసేవారు. ఎమ్మెల్యేలను పక్కనపెట్టి ఇన్ చార్జీలే ఎమ్మెల్యేలుగా , వారిదగ్గర ఉద్యోగులే సూపర్ ఎమ్మెలులుగా చలామణి అయిన చేదుఅనుభవాలు మరిచిపోకముందే ,ప్రస్తుతం పదవులలో ఉన్న అదే వైసిపి నేతలను పిలిచి , కార్యక్రమాలలో పెద్దపీట వేయడం గొప్పతనమే.. ఇది పరిణితి చెందిన , ప్రజాస్వామ్య సంప్రదాయం. . రాజకీయాలకు, సాంప్రదాయాలకు , అభివృద్ధి కార్యకక్రమాలకూ మధ్య ఒక స్పష్టమైన విధానముంది. అదేమిటో తెలియజెప్పాల్సిన పద్దతి ఇలాగేఉంటే రాజకీయాలను, అభివృద్ధి కార్యక్రమాలను పాలు , నీళ్లలా వేరుచేసి చూడొచ్చు.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

