వర్ధమాన గాయని ప్రవస్తిని ఆరోపణలు దెబ్బకు సింగర్ సునీత , సంగీత దర్శకుడు కీరవాణి , గేయరచయిత చంద్రబోస్ విలవిలలాడిపోతున్నారు. ప్రవస్తి దెబ్బ , సునీత బ్యాక్ గ్రౌండ్ పై సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రజాభిప్రాయం ప్రవస్తికే అనుకూలంగా ఉంది. సునీత, కీరవాణి ప్రతిష్ట దెబ్బతినింది. విమర్శలపాలైంది. జనం దృష్టిలో వీళ్ళు పలచబడిపోయారు. తమ తాబేదార్లచేత మద్దతుగా కొన్ని మాటలు చెప్పించినా మొత్తం మీద మరకలు అయితే పడ్డాయి. కీరవాణి మీద దారుణమైన లైంగిక ఆరోపణలు కూడా రావడంతో , షాక్ తిని మౌనంగా ఉండిపోయారు.
మొదట్లో సునీత ప్రవస్తి తనపై చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చిన ఆ తర్వాత మళ్లీ ప్రవస్తి అడిగిన ప్రశ్నలకు మౌనమే సమాధానం గా ఉండిపోయారు .తెలుగు సంగీత ప్రపంచంలో, టీవీల్లో పాటలు కార్యక్రమాల్లో చీకటి కోణాలను వెలుగులోకి రావడంతో వీళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో పడ్డారు. ఇదే దశలో కీరవాణిపై పై డైరెక్టర్ గీతాకృష్ణ ఆరోపణలు సంచలనం అయ్యాయి . దాంతో ఒకసారిగా కీరవాణి ప్రవర్తన పైన, ఆయన క్యారెక్టర్ పైన ప్రజల్లో అనుమాన బీజాలు మొలకెత్తాయి.

