మంచు విష్ణు, ఎప్పుడు ఏమిమాట్లాడుతాడో అతనికే తెలిసినట్టులేదు.. ఆయన భ్రమల్లో బ్రతుకుతున్నట్టుంది. సినిమా నటుడుగా చెప్పుకోదగ్గ చరిత్రలేదు, చూడదగ్గ సినిమాలు లేవు.. అయినా హీరోగానే చలామణి అయిపోతుంటారు. నేటికాలంలో అది సాధారణమే.. ఒక్క సినిమా చేసినా , ఆ తరుబాట ఛాన్సులు రాకపోయినా వాళ్ళు హీరోలు, హీరోయిన్లుగానే చలామణి అయిపోతుంటారు. రెబెల్ స్టార్ గానేకాదు , ఆల్ ఇండియా పాన్ స్టార్ గా పేరుపడ్డ ప్రభాస్ గురించి మంచు విష్ణు నోరు జారాడు.
మోహన్ బాబు నిర్మిస్తున్న కన్నప్ప సినిమాలో కన్నప్ప పాత్రదారిగా విష్ణు నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా విపరీతంగా యు ట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూలు ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రసిద్ధనటులు అక్షయ్ కుమార్, మోహన్ లాల్ ,శరత్ కుమార్ , ప్రభాస్ లాంటి హీరోలు కూడా నటిస్తున్నారు. ఈ సందర్భంగా విష్ణు ఒక యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడుతూ మోహన్ లాల్ లెజెండ్ యాక్టర్ అని అన్నారు.
ప్రభాస్ లెజెండ్ యాక్టర్ కాదని కూడా అనేసారు. భవిష్యత్తులో ప్రభాస్ కూడా లెజెండ్ యాక్టర్ అయ్యేఅవకాశం ఉందన్నాడు. కాలం మోహన్ లాల్ ని లెజెండ్ హీరోగా మార్చిందని , ప్రభాస్ కి టైం పడుతుంది అని అన్నాడు. ఒక్క సినిమా కూడా రెండు రోజులు ఆడించుకోలేని విష్ణు తమ అభిమాన హీరోని ఆలా అనడం ఏమిటని ప్రభాస్ ఫాన్స్ ఆవేదన చెందుతున్నారు. తమ అభిమాన హీరోని సాధారణ హీరోమాత్రమే అని అనడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

