22.5 C
New York
Saturday, April 4, 2026

Latest Posts

నెట్ ఫ్లిక్స్ వీడియోలన్నీ క్షణంలో డౌన్ లోడ్

జపాన్ ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో ఊహించని అద్భుతాలు ఆవిష్కరించింది. .నేటి సాంకేతిక యుగంలో బహుశా సమీప భవిష్యత్తులో ఇంత ఇంటర్నెట్ స్పీడ్ ను ఏ దేశము అధిగమించే అవకాశం కూడా లేదు .నిరంతర పరిశోధన , ప్రయోగాలద్వారా భవిష్యత్తును మార్చేయబోతొంది. క్షణంలో అరచేతిలో ప్రపంచాన్ని ఆవిష్కరించబోతొంది. ఇంటర్నెట్ రంగంలో అంత అప్రతిహతమైన అద్భుతమైన విజయాన్ని జపాన్ నిశ్శబ్దంగా సొంతం చేసుకుంది.

ఒక సెకనుకు 1.02 పెటాబైట్స్ వేగంతో ఇంటర్నెట్ లో ఫైల్స్ ట్రాన్స్ఫర్ లో ఈ రికార్డు సాధించింది . అంటే సెకండ్ కు పది లక్షల గిగా బైట్స్ డౌన్లోడింగ్ కెపాసిటీ అన్నమాట . ఊహించడానికే కష్టంగా ఉంటుంది. లెక్కవేయడానికి మరీ కష్టంగా ఉంటుంది. దీన్ని ఇంకా వివరంగా చెప్పాలంటే నెట్ ఫ్లిక్స్ సినిమాల లైబ్రరీ మొత్తాన్ని ఒక్క సెకండ్ లో డౌన్లోడ్ చేసే అద్భుతం అన్నమాట . జపాన్ లో దీన్ని 194 కోర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ తో ఈ విజయాన్ని సాధించారు .

52 కిలోమీటర్లు దూరంలో ఈ డేటా డాన్సర్ ఒక్క సెకండ్లో చేయగలిగారు. అంటే 10 మిలియన్ ల 8K వీడియోస్ ఒకేసారి డౌన్ లోడ్ అన్నమాట. లేదా ఇంగ్లీష్ వికీపీడియా మొత్తాన్ని పదివేల దఫాలు ఒక్క సెకండ్ లోపల డౌన్లోడ్ చేసుకోగల కెపాసిటీ జపాన్ ఇంటర్నెట్ సాధించింది. ప్రయోగశాలలో దీన్ని అద్భుతంగా పరీక్షించిన శాస్త్రవేత్తలు,ఇంజనీర్లు ఇంకా బహిరంగం చేయలేదు . భవిష్యత్తులో ఇంటర్నెట్ ఎలా ఉండబోతుంది ఎంత అద్భుతాన్ని సాధించబోతోంది అని దీని ద్వారా జపాన్ ప్రపంచానికి తెలియజేసింది .

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.