రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయి. దాదాపుగా ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా వానలు కురవనున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం కారణంగా మరో రెండు రోజులో సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఏపీలో ఈ రోజు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచే వర్షాలు కురుస్తున్నాయి.
రాయలసీమలో కర్నూలు,నంద్యాల మరియు అనంతపురం జిల్లాల్లో వర్షం కురుస్తుందని చెబుతున్నారు. కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి మరియు నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కూడా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు పడనున్నాయి.

