22.5 C
New York
Saturday, June 13, 2026

Latest Posts

అప్పుడు తండ్రీ కూతురు, ఇప్పుడు తల్లి కూతురు .

విజ్ఞానానికి వయసుతో పనిలేదు, చదువుకు వయసుతో పనిలేదు.. చదువుకోవాలన్న తాపత్రయం ఉండాలే గానీ వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు. ఎంబిబిఎస్ లో ప్రవేశానికి నీట్ పరీక్షలుకు హాజరైన అభ్యర్థులు. నల్గొండ జిల్లాలో నీట్ పరీక్షకు తల్లి కూతుర్లు ఇద్దరూ హాజరయ్యారు. కూతురుకి సూర్యాపేట సెంటర్లో, తల్లికి ఖమ్మం సెంటర్లో పరీక్ష జరిగింది. తల్లి భూక్యా సరితకు 38 ఏళ్ళు.. కూతురు కావేరికి 18 ఏళ్ళు. తల్లి సరిత నర్సింగ్ చదువుతూ , పెళ్లితో ఆపేసింది.

ఇద్దరు పిల్లలు , సంసారం మీద పడటంతో ఆ మునిగిపోయింది. కూతురు ఇంటర్ తరువాత నీట్ కి ప్రిపేర్ కావడంతో , ఆమెకూ ఆశలు మొలకెత్తి , నీట్ కి ప్రిపేర్ అయ్యి , పరీక్ష రాసింది. అదేవిధంగా గత ఏడాది వికాస్ మానహోత్ర అనే 50 ఏళ్ళ తండ్రి, కూతురు మీమాంస తో కలిసి నీట్ రాసాడు. తండ్రి కూతుళ్లిద్దరూ నీట్ లో ర్యాంక్ తెచ్చుకొని ఎంబిబిఎస్ సీటు సంపాదించారు.. ఇద్దరూ ఇప్పుడు ఒకే మెడికల్ కాలేజీలో చదువుతున్నారు..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.