22.5 C
New York
Sunday, April 5, 2026

Latest Posts

మాజీ డిజిపిని చంపిన భార్య , కారణమిదేనా ?

కర్ణాటక మాజీ డిజిపి ఓం ప్రకాష్ ని , భార్య పల్లవి దారుణంగా నరికి చంపేసిన తీరు సంచలనం అయింది. ఆస్తి విషయంలో ఇద్దరి మధ్య చెలరేగిన వివాదంలో , పల్లవి , భర్త కళ్ళలో కారం చల్లి, ఆ తరువాత కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేసింది. డిజిపి స్థాయిలో పనిచేసిన అధికారిని , రాష్టంలో శాంతిభద్రతలకు పెద్ద దిక్కుగా ఉన్న అధికారిని , చివరకు కట్టుకున్న భార్యే , దారుణంగా చంపడం సంచలనం రేకెత్తించింది. ఆ తరువాత తన స్నేహితురాలికి ఫోన్ చేసి , ఒక రాక్షసుడిని చంపేశానని చెప్పింది. హత్య జరిగిన సమయంలో కూతురు కీర్తి కూడా అక్కడే ఉంది.

దీంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 1981 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన ఓంప్రకాష్ బీహార్ కి చెందిన వ్యక్తి. కర్ణాటకలోని దండేలిలో ఉన్న ఒక భూమి విషయంలో బార్యాభర్తలమధ్య తరచూ గొడవలు జరిగేవని చెబుతున్నారు. కొన్ని నెలల క్రితమే ఆమె భర్తపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కి వచ్చింది. అయితే పోలీసులు నచ్చజెప్పి పంపేశారు. అప్పుడే మళ్ళీ వచ్చి స్టేషన్ ముందుకూడా బైఠాయించింది. ఆమెకు మానసిక సమస్యకూడా ఉందని , దానికి చికిత్స తీసుకుంటుందని చెబుతున్నారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.