22.5 C
New York
Sunday, April 5, 2026

Latest Posts

ఫ్యాక్టరీనుంచి 900 కియా కారు ఇంజన్లు మాయం

కార్లు దొంగతనం తరచూ చూస్తూనే ఉంటాం, వార్తల్లో చదువుతూనే ఉంటాం .. అయితే కార్ల ఫ్యాక్టరీ నుంచి కారు ఇంజన్లని మాయం చేసిన కుంభకోణం సంచలనం కలిగిస్తుంది . అది ఎక్కడో కాదు, కియా కార్ల కంపెనీలోనే . గత ఐదేళ్లుగా వందలాది ఇంజన్లు ,మాయం అయిపోవడం విశేషం. సత్యసాయి జిల్లా పెనుకొండ ప్రాంతంలో కియా కార్ల తయారీ సంస్థ ఉన్న విషయం తెలిసిందే. అయితే గత ఐదేళ్లుగా ఈ కియా కార్ల కంపెనీ నుంచి 900 వరకు కియా కార్ ఇంజన్లు మాయమైపోయాయని చెబుతున్నారు . ఇన్ని వందల కారు ఇంజన్లు కియా కార్ల కంపెనీ నుంచి మాయమైపోతున్నప్పటికీ కంపెనీ యాజమాన్యం ,అధికారులు ఆడిటింగ్ లో ఎలా పసిగట్టలేకపోయారు అన్నది ఇప్పుడు సస్పెన్స్.

ప్రత్యేకంగా వచ్చిన ఆడిటర్లు డేటా షీట్ పరిశీలించిన తర్వాత సంస్థలో దాదాపు 900 కారు ఇంజన్లు మాయమై పోయినట్టు గుర్తించారట .. ఈ విషయం కియా సంస్థ అధికారులు పోలీసులుకు సమాచారమిచ్చి గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేయమని కోరారు . కానీ పోలీసులు అందుకు అంగీకరించలేదు. రాతపూర్వకంగా ఫిర్యాదిస్తేనే తాము విచారణ చేస్తామని పోలీసులు వివరణ ఇచ్చారు . ఇప్పుడు కియా కంపెనీకి రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.. ఈ భారీ స్కాం వెనుక కంపెనీ ఉన్నతాధికారుల హస్తం లేకపోతే ఎలా జరుగుతుందని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఇప్పుడు కియాకారుల కంపెనీలో మాయమైంది ఇంజన్ లు ఎక్కడికి వెళ్ళాయో తెలియాల్సిన మరియు తేల్చాల్సిన అంశం.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.