శుక్రవారం నాడు మయన్మార్ , థాయిలాండ్ దేశాలని కదిలించిన భూకంపం ప్రభావం సముద్రంలోకి ఎంతన్న విషయాన్ని పరిశోధిస్తున్నారు. బ్యాంకాక్ , మయన్మార్ ప్రాంతాల్లో బహుళఅంతస్తుల భవనాలను కదిలించి , కూలదోసిన భూకంపం ప్రభావం భూమిమీదే ఆగిందా లేక సముద్రం అడుగుబాగంలోకి పోయిందా అనే విషయాన్ని సముద్ర గర్భ శాస్త్రజ్ఞులు నిశితంగా పరిశోదిస్తున్నారు. రిక్టర్ స్కేల్ పై 7.7 గా నమోదు అయిన ఈ భూకంపం చాలా తీవ్ర స్థాయిలో వచ్చింది. అమెరికాలోని జియోలాజికల్, ఓషియానాలజీ సర్వే నివేదిక ప్రకారం రెండు డఫాలుగా ఈ భూకంపం ఆ ప్రాంతాల్లో ప్రభావం చూపించింది. మొదటిసారి రిక్టర్ స్కేల్ పై 7.7 నమోదు అయినట్టు , రెండో దఫా నిమిషాల వ్యవధిలో 6.4గా నమోదు అయినట్టు తేలింది.
2004లో భీకరమైన సునామి ఆసియా దేశాలను సర్వనాశనం చేసింది. దాని నుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టింది . సముద్ర గర్భంలో వచ్చే ఆ భూకంపం సముద్రాన్ని ఉప్పొంగేటట్టు చేసి దాదాపు 12 దేశాలలో వినాశనాన్ని సృష్టించింది . సునామీ లోనే రెండు రకాలు ఉంటాయి . ఒకటి సముద్ర గర్భంలో వచ్చే భూకంపమే సునామీ , ఇది సముద్రాన్ని ఉప్పొంగేటట్టు చేస్తుంది. రెండోది కూడా భూకంపం లాంటి సునామినే . ఇది నీటిని వెనక్కు తీసుకుని కలిగించే వినాశనం. ఈ రెండు ప్రమాదకరమైనవి. ఇప్పుడు వచ్చిన ఈ భూకంపం సముద్రంలో ఎంత ప్రభావం చూపిందన్న విషయాన్ని పరిశోధించిన శాస్త్రవేత్తలు దీని ప్రభావం సముద్రం అడుగు భాగం వరకు పోలేదని నిర్థారించారు. ముక్కు తప్ప భూమి మీద వచ్చే ఈ భూకంపాలు సముద్రంలో కూడా వ్యాపించే అవకాశం ఉంది తీర ప్రాంతాల ద్వారా జరిగే పరిణామాన్ని ఇప్పుడు దాని ప్రమాదం తప్పిందని పేల్చారు

