కేరళ ఆర్టీసీ బస్సులలో ముగ్గురు డ్రైవర్లు ,మూడు వేరువేరు కేసుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డారు . అయితే ఈ ముగ్గురు డ్రైవర్లు అసలు తమకు తాగుడు అలవాటు లేదని, తాము తాగలేదని పోలీసులతో మొరపెట్టుకున్నారు. అయితే పోలీసులు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో వారు తాగినట్టు మాత్రం నిర్ధారణ అవుతుంది .ఆర్టీసీలో ఆ డ్రైవర్ల సహచరులుగానీ ,కుటుంబ సభ్యులుగాని వీళ్ళకి మద్యం అలవాటు లేదని ఎప్పుడూ తాగరని మాత్రం ఘంటాపదంగా చెబుతూ వచ్చారు . అయినా పోలీసులు వినకుండా కేసు పెట్టారు.
ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఈ ముగ్గురు తాగకపోయినా తాగినట్టు ఎందుకు ఆ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో తేలిందని విచారిస్తే ఆ బ్రీతి ఎనలైజర్ టెస్టుకు ముందు ,ఈ ముగ్గురు బాగా పనసకాయల తొనలు తిన్నారని తేలింది . మరి పనసకాయలకి ఆల్కహాల్ కి సంబంధం ఏంటి అని విచారిస్తే , పనసకాయలతొనలు తిన్నవారిలో అది కడుపులోకి పోయిన తర్వాత జరిగే రసాయనిక చర్య వల్ల ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుందట . ఇది శాస్త్రీయంగాను ,సాంకేతికంగానూ కూడా నిరూపితమైన నిజం. పనస పండుకున్న లక్షణం కూడా అదే.
అందువల్ల పనస తొనలు బాగా తిన్న వెంటనే ఒక అరగంట తర్వాత వీళ్ళు డ్రైవింగ్ చేశారు . అందువల్లనే ఈ ముగ్గురికి వేరువేరుగా చేసిన టెస్టుల్లో కూడా మద్యం తాగినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆర్టీసీ డ్రైవర్లు పోలీసులకు అసలు విషయం చెప్పారు . కానీ పోలీసులు మాత్రం మేమేం చేయలేం. బ్రీత్ ఎనలైజేర్ లో మీరు తాగినట్టు వచ్చింది కనుక కేసుపెట్టామని చెప్పేసారు. పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో మార్పులు చేసే వీలుండదు. అందువలన ఆర్టీసీ బస్సులో డ్రైవర్లు డ్యూటీకి పోయే ముందు పనస తొనలు తినవద్దని మాత్రం ఆర్టీసీ సూచించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.

