వైద్య రంగంలో నూతన ప్రయోగాలు రోజురోజుకీ సంచలనాత్మకమైన రీతిలో అభివృద్ధి చెందుతున్నాయి. అసాధ్యమనుకున్న వాటిని సుసాధ్యం చేసే చూపిస్తున్నారు. పట్టుదల, పరిశోధన, సంకల్పం ఎప్పుడూ మంచిఫలితాలనే ఇస్తుంది. నయం కాని , మందులు లేని జబ్బులకు ఒక ఆశా కిరణంగా ఉంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా మరియు యూనివర్సిటీ ఆఫ్ లాస్ ఏంజలిస్ సంయుక్తంగా బ్లాడర్ ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతం చేశాయి .
ఒక రోగికి గత ఎనిమిది సంవత్సరాలుగా బ్లాడర్ క్యాన్సర్ కారణంగా అది కిడ్నీలో కూడా సోకి డయాలసిస్ మీదనే ఉంటున్నాడు . వైద్యులు అతడికి వేరే మనిషి బ్లాడర్ ని అమర్చి అతడి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడం సంచలనమైంది. బ్లాడర్ ట్రాన్స్ ప్లాంటేషన్ నూటికి నూరు శాతం సక్సెస్ అయిందని డాక్టర్లు చెప్పారు . బ్లాడర్ మార్పిడిలో ఇదే ప్రపంచంలో మొదటి ప్రయోగమని తెలిపారు .
ఈ ఆపరేషన్ ద్వారా బ్లాడర్ ట్రాన్స్ ప్లాంటేషన్ పై మరిన్ని పరిశోధనలకు మరింత అభివృద్ధి దిశలో బ్లాడర్ వ్యాధులను న్యాయం చేసే దిశగా ముందుకెళ్తామని వివరించారు. ఇప్పటివరకు బ్లాడర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు . గుండె ,ఊపిరితిత్తులు ,కాలేయం, కిడ్నీలు ఇలా కొన్ని భాగాలు మాత్రమే అవయవమార్పిడికి అవకాశాలు ఉన్నాయి . అవి విజయవంతమై కొనసాగుతున్నాయి . అయితే బ్లాడర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనేది ఇదే ప్రధమం అని కాలిఫోర్నియా యూనివర్సిటీ వైద్యులు చెప్పారు.

