మరో రెండు రోజుల్లో అంటే ఏప్రిల్ 16 తేదీ పెళ్లి ముహూర్తం.. ఈ లోగా కాబోయే అల్లుడితో అత్తా లేచిపోయింది. ఇంట్లో కూతురు కోసం సిద్ధంగా ఉంచుకున్న మూడున్నర లక్షల డబ్బు, నగలతో కాబోయే అల్లుడుతో అత్త ఉడాయించేసింది. ఆలీఘర్ లో జరిగిందీ విచిత్రం. శివాని అనే యువతికి రాహుల్ తో నాలుగు నెలల క్రితం పెళ్లి కుదిరింది. పెళ్ళికి ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. అయితే గత మూడు నెలలుగా అత్త , కాబోయే అల్లుడు మధ్య మొబైల్లో మాటలు మొదలై , ప్రేమాయణం సాగింది. దీంతో రాహుల్ కూతురురిని వద్దనుకుని అత్తను ప్రేమించాడు.
అత్తకూడా అల్లుడికి మనసిచ్చేసింది. పెళ్ళికి అంటా సిద్ధం అవుతుండగా మూడు రోజులక్రితం ఇద్దరూ డబ్బు, నగలతో లేచిపోయారు. శివాని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పలుదఫాలు ఫోన్లు చేసిన తరువాత రాహుల్ ఒక్క సారిమాత్రం ఫోన్ ఆన్సర్ చేసాడు. భర్తతో ఆమెకు సుఖం లేదని , అందుకే తాను అత్తతో సహజీవనం కోసం నిర్ణయించుకొని వచ్చేశామని , కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండని ఉచిత సలహా ఇచ్చి ఫోన్ స్విచ్చాఫ్ చేసాడు. శివాని మాత్రం, తన తల్లిని, ఆమె ప్రియుడిని పట్టుకొని తమ నగదు, నగలు తమకు ఇప్పించాలని పోలీసులను కోరింది.

