వైకుంఠ ఏకాదశి పై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగిస్తారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వైకుంఠ ద్వార దర్శనాలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే దర్శనం లభించనుంది. దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలు చేకూరుతుంది. మొదటి మూడు రోజులు, .300 రూపాయలు , శ్రీవాణి దర్శనాలు రద్దు చేసారు. జనవరి 2 వ తేది నుండి 8వ తేది వరకు రోజుకు 15వేల రూ.300 దర్శన టిక్కెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యూలర్ పద్ధతిలో కేటాయింపు చేస్తారు.
మొదటి మూడు రోజులకు ఈ-డిప్ ద్వారా కేటాయింపు చేస్తారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 01 వ తేది వరకు దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పిస్తారు.డిసెంబర్ 2న డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లు కేటాయింపు చేస్తారు. టీటీడీ వెబ్ సైట్, యాప్, వాట్సాప్ ద్వారా పారదర్శకంగా టోకెన్ల జారీకి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తారు. జనవరి 6,7,8 తేదిల్లో తిరుమల, తిరుపతి స్థానికులకు రోజుకు 5వేల టోకెన్లు కేటాయింపు చేస్తారు. ఆన్ లైన్ లో ముందు బుక్ చేసుకున్న వారికి ముందు ప్రాతిపదికన టోకెన్లు కేటాయింపు జరుగుతుంది..
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

