22.5 C
New York
Sunday, April 5, 2026

Latest Posts

మెకానికల్ ఉద్యోగాలకే భవిష్యత్తులో డిమాండ్

కృత్రిమ మేధ అంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాకతో వైట్ కాలర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే ఇది నిజం కాదని భవిష్యత్తులో స్కిల్ల్డ్ లేబర్ కొరతే పెద్ద సమస్య కానుందని , పారిశ్రామికరంగం ఆందోళన చెండుతొంది. అదే పెద్ద సంక్షోభంలా మన ముందు ఉంది . దాన్ని మనం గుర్తించడం లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా అన్నారు. నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతే అసలైన సమస్య అని ఆయన తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు.. అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం ‘ఫోర్డ్’ సీఈవో జిమ్ ఫార్లే ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫోర్డ్‌లో ప్రస్తుతం 5,000 మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి సరైన నైపుణ్యం, అర్హతలున్నా వారులేరు. అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటూ పరుగులు తీస్తున్నారు. ఫోర్డ్ ఖాళీగా ఉన్న మెకానిక్ ఉద్యోగాలలో చాలా వాటికి వార్షిక వేతనం రూ. కోటి (1,20,000 డాలర్లు)కి పైగా ఉన్నప్పటికీ భర్తీ కావడం లేదని మహీంద్రా పేర్కొన్నారు.

మెకానికల్ ఉద్యోగాలకే భవిష్యత్తులో డిమాండ్

ఇది కేవలం ఫోర్డ్ కంపెనీకే పరిమితం కాదని, అమెరికా వ్యాప్తంగా ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ట్రక్కింగ్ వంటి రంగాల్లో పది లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.. ఏదేశంలో అయినా అభ్యర్థులు దొరకని ఉద్యోగాలు ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ట్రక్కింగ్ ఇతర మెకానికల్ ఉద్యోగాలే. దశాబ్దాలుగా మన సమాజం డిగ్రీలు, డెస్క్ ఉద్యోగాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, నైపుణ్యం ఆధారిత శ్రామిక శక్తిని విస్మరించిందని మహీంద్రా విశ్లేషించారు. నైపుణ్యం, అనుభవం, నేర్పు అవసరమైన ఈ పనులను ఏఐ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో ప్రపంచాన్ని నిర్మించే, నడిపించే, మరమ్మతులు చేసే నైపుణ్యం ఉన్నవారే ‘ఏఐ యుగంలో’ అతిపెద్ద విజేతలుగా నిలుస్తారని ఆయన జోస్యం చెప్పారు. నైపుణ్యం, కొరత కారణంగా కార్మికులు ఉన్నత స్థాయికి ఎదుగుతారని, ఇది హింస ద్వారా కాకుండా నైపుణ్యం ద్వారా వచ్చే విప్లవమని కార్ల్ మార్క్స్ కూడా ఊహించి ఉండరంటూ తన పోస్ట్‌ను ముగించారు.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.