దేవుడు ఇవ్వని, ఇవ్వలేని వరాన్ని , పూజారి ఇవ్వగలడా ? జగన్ దీన్ని అర్ధం చేసుకోవాలి అంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్ హాజరుపై ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఇది చట్టం చెబుతొంది. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఇదే విషయాన్ని బల్లగుద్ది చెప్పాడు.
మరి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా కావాలంటే ఎలా ? అంటూ ప్రశ్నించాడు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని జగన్ హైకోర్టుని కూడా ఆశ్రయించారు.అయితే ఈ పిటిషన్ ను కోర్టు ఇంకా విచారణకు స్వీకరించలేదు. అసలు దీనికి విచారణ అర్హత లేదన్నది న్యాయకోవిదుల అభిప్రాయం. అదికూడా నిజమే. ఇది తెలిసికూడా ఎందుకు పిటిషన్ వేశారన్నది అర్ధంకాని విషయం.

