పాత పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇక నుంచి పెట్రో, డీజిల్ పట్టకుండా ఆదేశాలిస్తున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి 10 ఏళ్లకు మించిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లకు మించిన పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ పంపుల్లో ఆయిల్ పట్టరు. ఈ వాహనాలను ప్రతి పసిగట్టేందుకు ప్రతి పెట్రోల్ పంప్ వద్ద ఎపిఎన్ ఆర్ కెమెరాలు పెడతారు. ఎపిఎన్ ఆర్ కెమెరా అంటే ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రీడర్.దీని ద్వారా పాత వాహనాలకు ఇంధనం పట్టినా తెలిసిపోతుంది. దీంతో వెంటనే ఆ పెట్రో పంప్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. లేదా ఫైన్ విధిస్తారు. ప్రస్తుతానికి ఈ నిబంధనలు దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే అమలులో ఉంటాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహనాలకైనా సరే పాతవైతే ఢిల్లీలో ఆయిల్ పట్టరు . ఈ విషయాన్ని వాతావరణ శాఖ కమిషన్ స్పష్టం చేసింది.
దేశ రాజధానిలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గమని కూడా చెప్పింది. గతంలో15 ఏళ్లకు పైబడ్డ వాహనాలుకు ఢిల్లీలో తిరిగే అనుమతి లేదని చెప్పినప్పటికీ ఇప్పుడు అలాంటి వాహనాలకు అసలు ఆయిల్ పట్టవద్దని ఆదేశాలు ఇచ్చేశారు . ఢిల్లీలో 15 ఏళ్లకు మించిన వాహనాలు తిరిగే దానికి వీలు లేదని చెప్పిన తరువాత ,.చుట్టుపక్కల రాష్ట్రాల్లోని వ్యక్తులు ఢిల్లీలో వాహనాలను కొనుగోలు చేసి ఢిల్లీకి వస్తుండడంతో కాలుష్యం అరికట్టే విషయంలో సక్రమమైన ఫలితాలు కనిపించడం లేదు . అందువల్లనే అధికారులు ఈ కఠినమైన నిబంధనలు తీసుకొని ప్రతి పెట్రోల్ పంపులవద్ద కెమెరాలను అమర్చి ఆ కెమెరాలు నంబర్ ప్లేట్ ని రేట్ చేసే విధంగా ఏర్పాటు చేసి ఆ వాహనాల చెల్లుబాటు కాలాన్ని అంచనా వేస్తున్నారు .
ఈ ప్రాతిపదికన ఢిల్లీలోని 520 పెట్రోల్ పంపులుకుగాను 500 పెట్రోల్ పంపులలో కెమెరాలు అమర్చారు . ఈనెలాఖరికి మిగతా 20 పెట్రోల్ పంపులలో కూడా కెమెరాలు ఏర్పాటు చేస్తారు . ఈ కెమెరాల ఆధారంగానే పెట్రోల్ పంపులలో ప్రవేశించే ప్రతి వాహనం కాలపరిమితిని నిర్ణయిస్తారు. ఈ నిబంధనలు ప్రస్తుతానికి ఢిల్లీలోనే అమలు చేస్తున్నప్పటికీ నవంబర్ ఒకటో తేదీ నుంచి గురుగ్రామ్ ,ఫరీదాబాద్ ,ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనేపట్ నగరాల్లో కూడా వీటిని అమలు చేస్తున్నారు . అక్కడ కూడా అక్టోబర్ 31 లోగాఈ కెమెరాలు అన్ని పెట్రోల్ బంకల్లో ఏర్పాటు చేస్తారు. ఢిల్లీ మరియు చుట్టుపక్కల నగరాల్లో 62 లక్షల పాత వాహనాలు ఉన్నాయి . వాటిలో 41 లక్షలు టూ వీలర్ వాహనాలు ఉన్నాయి. ఈ పాత వాహనాలే వాతావరణ కాలుష్యానికి ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయని కమిషన్ తేల్చింది. అందువల్లనే ఈ కఠినమైన నిబంధనను తీసుకొచ్చారు.

