22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

డిప్యూటీ సీఎంకే దడ పుట్టించిన ఐపీఎస్ అంజనా

మహారాష్ట్రలో ఓ యువ ఐపీఎస్ ఆఫీసర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆమె పేరు అంజనా కృష్ణ.. రెండేళ్ల క్రితమే డ్యూటీలో చేరింది.. పవర్ ఫుల్.. టాలెంటెడ్.. డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో నిన్న ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆమె పనిచేస్తున్న లిమిట్స్ లోని సోలాపూర్ లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని.. ఆ ఫోన్ లో సారాంశం.. ఇంకేముంది.. అసలే నిజాయితీకి మారుపేరైన అంజనా కృష్ణ.. వెంటనే తన సిబ్బందికి విషయాన్ని చెప్పి.. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే కింద స్థాయి పోలీసులు మాత్రం అక్రమ తవ్వకాలు జరిపిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అంజనా కృష్ణ స్వయంగా రంగంలోకి దిగేసింది.

డైరెక్ట్ గా స్పాట్ కి చేరుకొని.. అక్రమ తవ్వకాలు ఆపాలని ఆదేశించింది. అయితే అక్కడ అక్రమంగా తవ్వకాలు చేస్తున్న వారు అధికార పార్టీ నేతలు కావడంతో.. వారు ఆమెను కూడా బెదిరించారు. అక్కడున్న ఓ వ్యక్తి ఏకంగా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు ఫోన్ చేసి.. మాట్లాడమని అంజనా కృష్ణకు ఇచ్చారు. దీంతో చేసేదేమీ లేక అంజనా కృష్ణ ఫోన్లో మాట్లాడారు. వాళ్ళందరూ తమకు కావాల్సిన వారని.. చర్యలు తీసుకోవడానికి వీల్లేదంటూ అవతలి నుంచి వినిపించింది. అయితే డిప్యూటీ సీఎం వాయిస్ గుర్తుపట్టని అంజనా కృష్ణ.. ఓసారి డైరెక్ట్ గా వీడియో కాల్ చేస్తేనే నమ్ముతానని అన్నారు. దీంతో డిప్యూటీ సీఎంకి కోపం వచ్చి.. వీడియో కాల్ చేశారు. ఈ తతంగం మొత్తాన్ని అక్కడే ఉన్న కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. ఆ వీడియోలు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొత్తానికి డిప్యూటీ సీఎంనే మూడుచెరువుల నీళ్లు తాగించిన ఈ అంజనా కృష్ణ గురించి ఇప్పుడు చాలామంది వెతకడం ప్రారంభించారు. అంజనా కృష్ణ 2022 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి.. UPSC సివిల్ సర్వీసెస్‌ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 355 ర్యాంకు సాధించారు. కేరళలోని తిరువనంతపురంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. అంజనా కృష్ణ తండ్రి టెక్స్‌టైల్‌ బిజినెస్‌ నిర్వహిస్తుండగా.. తల్లి కోర్టులో టైపిస్టుగా పనిచేస్తున్నారు. ఏకంగా ఓ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంనే లెక్కచేయకుండా, నిజాయితీగా విధులు నిర్వహించిన ఈ యువ ఆఫీసర్ ని ఇప్పుడు అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా అవినీతిపరులకు.. అక్రమార్కులకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎంపై కూడా జనం దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇవి కూడా చదవండి.

ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

షర్మిల కొడుకు రాజకీయాల్లోకి ,మేనమామ జగన్ కి పోటీగా

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.