పోసానికి చివరకు ఎంత గతి పట్టింది.? వైసిపి అధికారంలో ఉండగా టిడిపి, జనసేన నేతలను , వారి ఇళ్లలో మహిళలను అసభ్యంగా తిట్టిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని రాజంపేట సబ్ జైల్లో ఉంచారు. సాధారణంగా అయితే జిల్లా జైల్లో లేదా సెంట్రల్ జైల్లో పెడతారనుకుంటే ,చిల్లర నేరాలతో జైలుకు పోయే వాళ్ళున్న సబ్ జైల్లో ఉంచారు. పాపం , ఇప్పుడు ఏమిమాట్లాడలేక సబ్ జైల్లోనే ప్రత్యేక గదిలో ఉన్నాడు.సబ్ జైల్లో ప్రత్యేక గది ఇచ్చారు. బయటనుంచి ఆహరం తెచ్చుకునేందుకు అనుమతించారు.
బెయిల్ పిటిషన్ కూడా సోమవారం కోర్టు ముందుకొచ్చే అవకాశం ఉంది. అదే రోజు పోలీసులు కూడా అతడిని కస్టడీ కోరుతూ వేసే పిటిషన్ పై కూడా విచారణ జరుగుతుందని భావిస్తున్నారు. మొత్తానికి వ్యూహాత్మకంగా పోసాని సబ్ జైల్లో పెట్టీ నేరస్తులతో కాలం గడపక తప్పనిపరిస్థితి నెలకొనింది. టిడిపి ఫ్యాన్స్ ఇప్పుడు లవ్ యు రాజా అనే ట్యాగ్ తో పోస్టింగ్స్ పెడుతున్నారు.

