యెమెన్ దేశంలో జైల్లో ఉన్న కేరళకు చెందిన నర్స్ నిమిషప్రియ మరణశిక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 16వ తేదీ నిమిష ప్రియకు మరణశిక్ష అమలు చేయబోతున్నారు . ఆమె క్షమాబిక్ష పిటిషన్ కూడా యెమెన్ అధ్యక్షుడు తిరస్కరించారు . దీంతో ఆమెకు మరణశిక్ష అమలు చేయడం తప్పనిసరి అయింది. యెమెన్ చట్టాల ప్రకారం నిమిషప్రియను తుపాకీతో కాల్చి చంపడం ద్వారా మరణ శిఖ అమలు చేస్తారు. యెమెన్ లో మూడు విధాలుగా మరణ శిక్షలు అమలు చేస్తారు . మొదటిగా నడివీధిలో క్రేన్ కు ఉరి తీయడం, లేదా రాళ్లతో కొట్టి చంపడం , లేదా తుపాకీతో కాల్చి చంపడం ద్వారా మరణశిక్షను అమలు చేస్తారు .
ఒక భద్రత సిబ్బంది మరణశిక్షను అమలు చేస్తాడు అతడు తన రైఫిల్ తో ఆమెను షూట్ చేస్తాడు. ఈ విధానంలో ఒక దుప్పటి లేదా చాప లేదా రగ్గు నేల మీద పరుస్తారు . రెండు చేతులు వెనక్కి కట్టివేసి మోకాళ్ళ మీద ముఖాన్ని నేలకు తగిలేట్టు ఉంచుతారు. ఆ తర్వాత రైఫిల్ తో వెన్నెముక భాగంలో కాలుస్తారు. మెదడుకి మిగతా శరీరానికి సంబంధం ఉన్న వెన్నెముక భాగంలో కాలుస్తారు . ఆ తర్వాత మెదడులోకి రెండు బుల్లెట్లు, ఆ తర్వాత గుండెకు గురి చూసి ఒక బుల్లెట్ పేలుస్తారు. ఈ విధానం ద్వారా మరణశిక్షను తుపాకీ ద్వారా అమలు చేస్తారు.
నిమిషప్రియ యెమెన్ దేశంలో హాస్పిటల్స్ లో నర్సుగా పనిచేసింది .. హాస్పిటల్లోనే పరిచయమైన యెమెన్ దేశస్తుడితో కలిసి సొంతంగా 14 పడకల హాస్పిటల్ ప్రారంభించింది. అయితే అతడు ఆమెను మోసం చేసి ఆమె డబ్బులు, పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకుని హింసలు పెట్టాడు. తనకు భార్యగా ఉండాలని నిర్బంధించాడు. అతడి చెర నుంచి విడిపించుకుని భారతదేశం వచ్చేయాలని ప్రయత్నాలు చేసింది. భోజనంలో అతనికి కేటామినల్ అనే మత్తుపదార్ధం కలిపి పెట్టింది. దీంతో అతడు చనిపోయాడు . మామూలుగా దీన్ని మత్తుమందుగా వాడుతారు .

