వచ్చే ఏడాదినుంచి కొత్తగా బైకులు, త్రీ వీలర్స్ కొనేవారికి కేంద్ర రవాణా శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది . షోరూమ్ నుంచి బైక్స్, త్రి వీలర్స్ , కొనుగోలు చేసే వారికి ఖచ్చితంగా ఈ రెండు ఈ నిబంధనలను వర్తిస్తాయి . బైక్లు కొనుగోలు చేసే వారికి షోరూం లోనే రెండు హెల్మెట్లు కూడా ఇవ్వాలని కేంద్రం షరతు విధించింది. హెల్మెట్లు తీసుకుంటేనే బైకు కొనుగోలుకు అవకాశం ఉంటుందని కూడా ఈ విషయాన్ని కూడా తెలియజేయాలని ఆదేశించింది . ఇది కాకుండా 2026 అంటే వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రతి టు వీలర్ ,త్రీ వీలర్ కు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం అంటే ఏబిఎస్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది .
యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం లేకుండా బైకులు గాని ఆటోలు గాని తయారు చేయకూడదని , ఏడాది తర్వాత వాటిని విక్రయించకూడదని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇంజన్ కెపాసిటీతో సంబంధం లేకుండా టూవీలర్లకు ,త్రీ వీలర్లకు ఏబిఎస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పింది. ప్రస్తుతం 125 సిసి ఇంజన్ వాహనాలకు మాత్రమే ఎబిఎఎస్ ఉంది . 2026 లో ఒక కోటి 96 లక్షలు బైక్లు అమ్ముడుపోతాయని అంచనా.
వీటిలో కోటి 53 లక్షల బైకులు 125 సిసి ఇంజిన్ తో ఉన్నాయి. 125 సిసి దిగున ఉన్న కెపాసిటీ గల బైకులు ఏబిఎస్ బ్రేక్ సిస్టం పెట్టాలని కేంద్రం ఆదేశించడంతో వాటి ధర కనీసం 2000 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. 2022 లెక్కల ప్రకారం దేశంలో జరిగిన ప్రమాదాలలో 44.5 శాతం ప్రమాదాలు బైక్ రైడర్లకు జరిగినవే. వీటిల్లో ఎక్కువ భాగం తలకు తగిలిన గాయాలతో చనిపోయిన వారే. అందువల్లనే హెల్మెట్ల పై కేంద్రం వచ్చే ఏడాదినుంచి కఠినంగా ఉండబోతొంది.

