22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

ఆ నంబర్ తో ఇక విమానం ఎగరదు.

అహ్మదాబాద్ , లండన్ విమాన ఘోర ప్రమాదం తరువాత ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. తమ . AI-171 నంబర్‌ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నంబర్ తో ఇక ఎయిరిండియా ఇక ఎలాంటి విమానాలు నడపదు. దీనికి బదులుగా AI-171 స్థానంలో AI-159 నెంబర్‌ విమానం.17 వ తేదీ నుంచి రంగంలో ఉంటుంది. విమాన ప్రమాద మృతులకు గౌరవార్ధంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా .ప్రకటన.చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఏదైనా నిర్దిష్ట నంబర్ తో ఒక విమానం నడుస్తుంటే ఆ విమానం ప్రమాదానికి గురైతే , ఆ సీరీస్ తో ఇక విమానాలు నడపడం ఆపేస్తారు. ఇది ప్రయాణీకులకు సెంటిమెంట్ కూడా . ఆ సెంటిమెంట్ తోనే ప్రయాణీకులు అలాంటి నంబర్ ఉన్న విమానాలలో ప్రయాణం చేసేందుకు వెనుకంజవేస్తారు. అందువల్ల విమాన సంస్థలు కూడా దెబ్బతింటాయి.

ఈ కారణంగాకూడా ప్రమాదానికి గురైన విమానం సీరీస్ నంబర్లను మార్చేస్తారు. ఇదిలా ఉండగా విమాన ప్రమాద మృతుల, వారి బంధువుల డీఎన్ ఏ పరీక్షల నిర్ధారణ ఇంకా కొనసాగుతొంది. వివిధ సంస్థలు ప్రమాదం కారణాలను అన్వేషించే దర్యాప్తులో ఉన్నారు. విమానం పడిపోయిన చోట ప్రతి అంగుళాన్ని , ఆధారాలకోసం గాలిస్తున్నారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.