కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతిలో ఎంత బరితెగించి పోయారో తెలిపే సంఘటన ఇది.. ముంబైలో వాసై విరార్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిజేసే టౌన్ ప్లానింగ్ అధికారి వైఎస్ రెడ్డి అక్రమసంపాదన చూసి ఈడీ అధికారులకు కళ్ళు తిరిగిపోయాయి., హైదరాబాద్ లోని ఆయన ఇంటిలో తనికీలు చేసిన ఈడీ అధికారులకు 30 కోట్ల విలువైన బంగారు, వజ్రాలు , కరెన్సీ దొరికింది. ఇది కేవలం ఒక చిన్న పార్ట్ మాత్రమేనని అధికారులకు అనుమానంగా ఉంది.
ఇంట్లోనే 9 కోట్ల రూపాయలు నగదు, 23 కోట్ల రూపాయల వజ్రాల నగలు, బంగారు బిస్కెట్లు పెట్టాడంటే , ఇక స్థిరాస్తులు, భవనాలు, లాకర్లు, బంధువులపేరుతో ఆస్తులు, ముంబైలోని మిగిలిన 12 చోట్ల సోదాలలో ఇంకెంత అక్రమసంపాదన బయటపడుతుందోనన్న ఆసక్తి నెలకొనింది. ముంబైలో ఒక స్థలానికి సంబంధించి అక్రమ కట్టడాలకు అనుమతి ఇవ్వడం, ఆ ప్రాజెక్ట్ ద్వారా హవాలా డబ్బులు లావాదేవీలలో ఈదాడులు జరిగాయి. ఆ నిర్మాణం కూడా బోగస్ యజమాన్యపత్రాలతో చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

