సినీ నటుడు పోసాని కృష్ణ మురళి , వైసిపి ఫైర్ బ్రాండ్ రౌడీ బోరుగడ్డ అనిల్ ని వైసిపి నేతలు పూర్తిగా వదిలేసినట్టున్నారు. కేసులుమీద కేసులు పెట్టి కోర్టులు తిప్పుతున్నా ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. వైసిపి అధికారంలో ఉండగా నీచ, నికృష్ట పదజాలంతో టిడిపి , జనసేన నేతలను, వాళ్ళ ఇళ్లలో మహిళలను దూషించిన కేసులో ఇద్దరూ అరెస్టయ్యారు. సభ్యసమాజం తలదించుకునే విధంగా వీళ్ళు చేసిన దూషణలు , వ్యాఖ్యలు వైసిపి బాస్ లు ఆదేశాలు, స్క్రిప్ట్ ప్రకారమే జరిగాయి. ఈ వ్యవహారంలో బోరుగడ్డ అనిల్ ముందు పోలీసులకు చిక్కినా , అతడెవరో తమకు తెలియదన్నట్టు వైసిపి నేతలు ఉండిపోయారు.
ఆ తరువాత పోసాని అరెస్ట్ ప్రారంభంలో జగన్ కూడా ఆయన అరెస్ట్ ని ఖండించారు. మొదట్లో వైసిపి నేతలు ఆయనకు అండగా నిలబడ్డా , ఇప్పుడు పట్టించుకునే నాధుడే లేడు. న్యాయ సహాయం కూడా స్థానిక న్యాయవాదులతోనే జరుగుతొంది. అవినాష్ రెడ్డి విషయంలో ఢిల్లీనుంచి లక్షలు ఖర్చు పెట్టి ఉద్దండులైన న్యాయవాదులను పిలిపించి కేసులు వాదించేందుకు వైసిపి యంత్రాంగం పనిచేసింది. అయితే ఇప్పుడు తమకోసం, తమ డైరెక్షన్ల్, స్క్రీన్ ప్లే , స్క్రిప్ట్ చదివి జైలు పాలైన పోసాని, బోరుగడ్డలను వైసిపి వదిలేసింది. పోసాని ఏడుపుకి ఇదే కారణమని చెబుతున్నారు. బోరుగడ్డ అనిల్ కూడా గతంలో తన ఫోన్ అంటే మొదటి రింగ్ కే సమాధానం చెప్పే వైసిపి నేతలు , ఇప్పుడు తన నంబర్ బ్లాక్ చేశారని , ఎవరూ సహాయం చేయడంలేదని ఆక్రోశిస్తున్నాడు .

