22.5 C
New York
Tuesday, April 7, 2026

Latest Posts

ఏపీలో మీడియాకు అంత విలువ ఉందా ?

గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వేరుకున్నట్టు ఉంటుంది పత్రికల గురించి ,పత్రిక స్వేచ్ఛ గురించి, పత్రికల నిష్పాక్షిత గురించి చెప్పాలంటే ఇంతకంటే మంచి ఉదాహరణ దొరకదు . గతంలో ప్రముఖ కవి, పాత్రికేయుడు గజ్జల మల్లారెడ్డి చెప్పినట్టు పత్రికలలో రాసేవన్నీ అన్ని సత్యాలే కాదు గాని రాసినవన్నీ అసత్యాలు కూడా కాదు అనే మాట, ఆయనే మరో సందర్భంలో సిల్క్ స్మితకు సీత వేషం వేస్తే ఎలా ఉంటుందో పత్రికలు నిజాలే చెప్తాయని నిస్పాక్షికంగా రాస్తాయని చెప్పడం కూడా అంతే అబద్ధం..ఇది నేటికీ ఖచ్చితంగా సరిపోయే నిజం . నికార్సుగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ పత్రిక, ఏ టీవీ ఛానల్, నిష్పక్షపాతంగా పనిచేయదు . చెయ్యలేదు కూడా . అన్ని పాలకవర్గాలకు, ప్రతిపక్ష పార్టీలకు దాసోహం అయినవే. పత్రికలు ,ఛానల్స్ బ్రష్టు పట్టి పోయాయి.

ఇలాంటి పరిస్థితుల్లో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తన మనుషులను పోగుచేసి , స్థాయిని మరిచి , ఏబీఎన్ కార్యాలయం పై దాడి చేయించడం తప్పే . అలాగని ఏబీఎన్ రాసిందంతా నిజాలని ,నిష్పక్షపాతంగా రాస్తాడని చెప్పలేము . ఎందుకంటే సాక్షి కూడా నిజాలు రాయడం మర్చిపోయి చాలా కాలమైంది. ఎబిఎన్ లాగే సాక్షి కూడా అబద్దాలను వండి వార్చే పనిలోనే ఉంటుంది. మీడియా విలువలు పాటించడంలో ఎవరు పతివ్రతలు కాదు . ఏ పత్రిక ,ఏ ఛానల్ కూడా తాము పాత్రికేయ వృత్తిలో పాతివ్రత్యంతో ఉన్నామని చెబితే అది బురదలో వరాహం తాను ధవళ వర్ణంతో మెరిసే జంతువునని చెప్పినట్టే . ఇది నికార్సైన ,నిష్ఠురమైన ,కాదనలేని నిజం .

చివరిగా ఓ ముఖ్య విషయం . పత్రికల్లో లేదా సోషల్ మీడియాలో లేదా టీవీ చానల్స్ లో వచ్చే ఏ ఒక్క అంశాన్ని కూడా ప్రజలు నమ్మడం లేదు అనడానికి గత మూడు సందర్భాల్లో జరిగిన ఎన్నికలే నిదర్శనం . ఏ టీవీ ఛానల్ ఎవరికి బాకా ఊదినా , ఏ టీవీ ఛానల్ ఒకరిని ఆడిపోసుకున్నా , తిట్టిపోసిన జనం పట్టించుకోరు . అంతవరకే తిట్లను ఆస్వాదించి , ఆ వదిలేస్తారు. మీడియా కథనాలు నమ్మే కాలం కాదిది . జనాభిప్రాయం ప్రకారం ఓటేస్తారే తప్ప , టీవీ చానల్స్ ,పత్రికలు ,సోషల్ మీడియాతో ప్రజల తీర్పు మారుతుందనుకోవడం నూటికి నూరు శాతం తప్పు. అది భ్రమ మాత్రమే. ఇది చరిత్ర చెప్పే సత్యం.గత మూడు ఎన్నికల్లోను తేలిన నిప్పులాంటి నిజం.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.