మాజీ ముఖ్యమంత్రి జగన్ భార్య వైఎస్ భారతి భవిష్యత్తులో క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా పాల్గొననుందా..? వచ్చిఏ ఎన్నికలకు రెండేళ్ల ముందే ప్రచారానికి శ్రీకారం చుట్టనుందా..? వైసిపి తరపున ఆమె స్టార్ క్యాంపైనర్ కానుందా..? వీటన్నింటికి అవుననే సమాధానం వచ్చే దిశగా పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి వైసిపి మహిళా స్టార్ క్యాంపెయినర్లు లేరు. జగన్ చరిష్మా కూడా ఇదివరకు మాదిరి మాత్రం లేదు. ఆయనకు ఐదేళ్ల పాలనలో అనేక తప్పిదాలవల్ల కొన్ని వర్గాలు, కులాల్లో , విద్యావంతుల్లో వ్యతిరేకత ఉంది. రోజా లాంటి లేడీ స్టార్ క్యాంపెయినర్లు ఇప్పుడు మసకబారిపోయారు. వాళ్లకు జనంలో పాపులారిటీలేదు. వైసిపిలో జగన్ తప్ప , దరిదాపుల్లో కూడా పదిమందిని ఆకర్షించగల నాయకుడు లేడు. అందరూ ఊడగొట్టిన నాగేళ్లే .

జగన్ అధికారంలోకి వచ్చేందుకు అప్పట్లో ఆయన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల ప్రచారాలు బాగా ఉపయోగపడ్డాయి. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజునుంచే కిచెన్ రాజకీయం భారతి చేతికొచ్చింది. ఇద్దరినీ దూరం పెట్టింది. చివరకు జగన్ ఇంట్లో, కోటరీలో భారతి మనుషులే చేరిపోయారు. దాదాపుగా ఆమె పెత్తనమే నడిచింది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె రాజ్యాంగేతర శక్తిగా పెత్తనం చెలాయించింది. చివరకు పార్టీ దారుణ ఓటమి తరువాతకూడా ఆమె కనుసన్నల్లోనే పార్టీ ఉంది. మరో నాలుగేళ్లలో రాబోయే ఎన్నికలు ఇప్పుడు లేడీ స్టార్ క్యాంపెయినర్లు లేరు. ఈ పరిస్థితుల్లో ఆమె తప్ప జగన్ కోయి వేరే దిక్కు లేదు. తల్లి, చెల్లెలిని దూరం చేసిన తరువాత ఆమె మాత్రమే ఇప్పుడు వచ్చే ఎన్నికలకు ప్రచారానికి, పాదయాత్రకు సిద్ధం కావాల్సిన పరిస్థితి..

