ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. అవసరమైనప్పుడు తన కుమారుడు రాజారెడ్డి కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ను షర్మిల.. తన కుమారుడు రాజారెడ్డితో కలిసి పరిశీలించారు. ఉల్లి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో తన కొడుకు రాజారెడ్డికి ప్రత్యక్షంగా చూపించారు. రాజారెడ్డి తొలిసారిగా ప్రజల్లోకి రావడంతో కాంగ్రెస్ నేతల్లో కూడా జోష్ కనిపించింది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ నేతలు కాస్తంత స్తబ్దుగా ఉన్నా..రాజారెడ్డి రాకతో వారిలో కొత్త ఉత్సాహం కనిపించింది.
గత ఎన్నికల్లో షర్మిల ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. పూర్తిగా మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీని భుజానికెత్తుకొని ఏపీలో కాస్తో కూస్తో రాజకీయం చేశారు. ప్రధానంగా తన సోదరుడు జగన్ ను ముప్పతిప్పలు పెట్టారు. జగన్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడానికి షర్మిల కూడా ఒక కారణంగా మారారు. అయితే ఎన్నికలు గడిచిన తర్వాత కూడా జగన్.. షర్మిలను దగ్గరకు రానివ్వలేదు. దాదాపుగా పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్టే కనిపించింది. తండ్రి ఆస్తిలో షర్మిలకు వాటా ఇవ్వలేదన్న ప్రచారం కూడా జరిగింది. ఆఖరికి షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్ళిలో కూడా జగన్ ఎక్కువగా కనిపించలేదు. ఎదో తూతూ మంత్రంగా హాజరై.. దంపతులను ఆశీర్వదించి వెళ్లిపోయారు. పెళ్లి సమయంలో రాజారెడ్డి ఎక్కువగా మీడియాలో కనిపించారు. `
అయితే మళ్ళీ ఇన్ని రోజులకి రాజారెడ్డి తెరపైకి వచ్చారు. తాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వంతో రాజకీయాల్లోకి రావడానికి సిద్దమైపోయినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో జగన్ తనను దూరం పెట్టడం.. ఆస్తులు సరిగ్గా పంపకాలు చేయకపోవడంతో షర్మిల కూడా జగన్ తో పూర్తిగా యుద్దానికి సిద్దమైపోయినట్టు కనిపిస్తోంది. అందుకే తన వారసుడిగా రాజారెడ్డిని రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగానే తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉండగా ప్రతిపక్షపార్టీగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు.. 2029 ఎన్నికల నాటికి రాజారెడ్డిని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

