మాజీ ముఖ్యమంత్రి జగన్ తెనాలి పర్యటనపై వైసిపి నేతల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి. గతంలో అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులకు సంఘీభావంగా , మద్దతుగా జగన్ తెనాలికి రావడమే దీనికి కారణం. ఎవరేమన్నా డోంట్ కేర్ అన్నతీరులో జగన్ పర్యటనకు రావడంతో , తెనాలికి అనుచరులు, కార్యకర్తలను సమీకరించారు. ఒక కానిస్టేబుల్ పై హత్యాయత్నం కేసుకు సంబందించిన కేసులు ముగ్గురు నిందితులకు పట్టపగలే , నడిరోడ్డులో పోలీసులు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు, పోలీసుల చర్యను సమర్థిస్తూ కొందరు వ్యాఖ్యలు చేసారు. అలాంటి రౌడీ షీటర్లకు ఇదే తగిన గుణపాఠమని అన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో మౌనంగా ఉండిపోయారు.
తెనాలిలో హత్య, హత్యాప్రయత్నాలు, రౌడీయిజం కేసుల్లో ఈ ముగ్గురూ నిందితులే. అందువల్ల స్థానికంగా కూడా ఈ సంఘటనపై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అయితే వైసిపి మాత్రం దీన్ని ఖండిస్తూ ప్రకటన ఇచ్చింది. ఈ విషయంలో పార్టీ నాయకుల్లో కూడా పెద్ద స్పందన లేకపోవడం గమనించిన జగన్ , తానే ఈ వీడియో పోస్ట్ చేసి , ఖండన ఇచ్చాడు. దీంతో మిగిలిన వైసిపి నేతలూ ముందుకు రావాల్సిన పరిస్థితి. ఇది చాలదన్నట్టు జగన్ తానే స్వయంగా బాధితుల పరామర్శకు తెనాలికి పోతానని చెప్పడమే కాదు, మంగళవారం ఉదయాన్నే వచ్చి, బాధితులను పరామర్శించాడు.
ఈ కేసులో బాధితులు దళితులు అని వైసిపి , చేసిన ప్రచారంతో, బాధితులూ దళితులేనని తేలడంతో దళిత కార్డు పక్కనపడేసి, ప్రజాస్వామ్యం, పోలీస్ రాజ్యం అంటూ నినాదం అందుకున్నారు. మొత్తానికి ఈ విషయంలో జగన్ ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే. తెనాలిలో ఎన్నో కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని, రాజకీయాలకు సంబంధంలేని అంశంలో నిందితులైన వారిని పరామర్శించి తన తెగువను నిరూపించుకున్నాడు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్.. అంటూ ముందుకు కదిలాడు.. అదీ జగన్ స్పెషల్

