పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపికి ఆశాభంగమే ఎదురైంది. ఇప్పటివరకూ వైసిపి చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలకు ఇప్పుడు వైసిపికి విరామ ప్రకటించాల్సిన పరిస్థితి ఎదురైంది. టిడిపి ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని , ఇప్పుడు ఎన్నికలు జరిగినా 175 కి 175 సీట్లు తమవేనంటూ చెప్పిన వైసిపి నేతలు ఇప్పుడు తోక ముడుచుకోవాల్సిన పరిస్థితి.
ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి అభ్యర్థుల వ్యతిరేకులకు వైసిపి బహిరంగంగానే మద్దతు ఇచ్చింది. తమ శ్రేణులను వారికి అండగా మోహరించింది. అయితే అంచనాలు తారుమారై , అద్భుత మెజారీటలతో టిడిపి అభ్యర్థులు గెలిచారు. టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీనివాసులుకి కూడా టిడిపి మద్దతు ఇచ్చింది. అతడూ విజయం సాధించాడు. దీంతో ఇప్పటివరకు వైసిపి చేస్తున్న ఆరోపణలపై కొంతకాలం విరామం తప్పదు.
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగిన నాలుగు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి గెలిచింది. అదే భవిష్యత్తు సంకేతంగా , విజ్ఞులు భావించినా , వైసిపి రాజకీయ మేధావులు , విశ్లేషకులు దాన్ని పసిగట్టలేకపోయారు. పిడి వాదనలకు దిగారు. ఇలాంటి వారివల్లనే వైసిపికి మొదటినుంచి నష్టం జరుగుతొంది. ప్రజాభిప్రాయాన్ని పసిగట్టలేని వారంతా , వైసిపి కి సలహాదారులుగానో , మీడియాలో అధికారపతినిధులుగానో ఉన్నారు. నిజాన్ని తెలుసుకోలేని ఈ మేధావుల వల్లనే వైసిపి పడవ మునిగింగిందన్న విషయం ఇప్పటికీ ఆ పార్టీ పెద్దలకు అర్ధంకానట్టుంది .

