22.5 C
New York
Saturday, April 4, 2026

Latest Posts

కారు దిగమంటే యువతి తుపాకి ఎక్కుపెట్టింది.

పెట్రోల్ పంప్ వద్ద కారు నుండి దిగమని కోరినందుకు ఓ యువతి ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి దాడి చేసింది. ఉత్తరప్రదేశ్ – హర్దోయ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. కారులో సిఎన్జి నింపుతున్నప్పుడు పంప్ ఆపరేటర్ కారులో కూర్చున్న వ్యక్తులను కిందకు దిగమని కోరడంతో ఈ వివాదం చోటు చేసుకుంది. సాధారణంగా కారులో గ్యాస్ నింపుతున్నప్పుడు , కారు డ్రైవింగ్ సీట్ , మరియు కారులోని వాళ్ళని కిందకు దిగమంటారు. భద్రతా చర్యలకోసమే ఇలా చెబుతారు.

షాబాద్ ప్రాంతానికి చెందిన ఎహ్సాన్ ఖాన్ అనే వ్యక్తి సాయంత్రం 6 గంటలకు బిల్ గ్రామ్ కొత్వాలి ప్రాంతంలోని సాండి రోడ్లోని పెట్రోల్ పంపుకు తన కుమార్తె సురీష్ ఖాన్ అలియాస్ అరిబా, భార్య హు్‌స్న్ బానోతో కలిసి కారులో వచ్చారు . సిఎన్జి నింపుతుండగా, వారిని కారు నుంచి దిగమని ఉద్యోగి రజనీష్ కుమార్ కోరడంతోవారు కారు దిగకపోవడంతో కారులో సిఎన్జి నింపడానికి నిరాకరించిన ఉద్యోగి రజనీష్ కుమార్ ని బెదిరించారు.

దాడిచేసే ప్రయత్నం చేసారు. ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి దాడికి దిగిన యువతి తీవ్రస్వరంతో బెదిరించింది. ఉద్యోగి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి.. యువతిని, ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని లైసెన్స్ పొందిన రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు,

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.