పెళ్లిళ్ల సందర్భంగా వధూవరులు కంటే పెళ్లికి హాజరయ్యే దగ్గర బంధువుల్లో హడావుడి ఎక్కువ . డ్రస్సులు , ఇతర అలంకరణలు , బ్యూటీ పార్లర్లు విజిట్స్ .. ఇలా పెళ్లి వారితో సమానంగానే దగ్గర బంధువులు కూడా హడావుడిపడటం , రెడీ కావడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది . దగ్గర బంధువులు, స్నేహితుల పెళ్ళికి రెడీ అయ్యే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన ఓ సంఘటన దగ్గర బంధువుల పెళ్లి ముస్తాబులలో ఆసక్తిని తెలియజేస్తుంది . పూనం అనే మహిళ తన బంధువుల పెళ్లికి పోవాలని ఓ డ్రెస్ మేకింగ్ సంస్థలో బ్లౌజ్ కి ఆర్డర్ ఇచ్చింది. తను చెప్పిన డిజైన్ ప్రకారం ఉండాలని చెప్పి డిజైన్ కూడా ఇచ్చింది . ఈ బ్లౌజ్ మేకింగ్ 4500 రూపాయలు అవుతుందని టైలర్ ఆమె దగ్గర డబ్బులు కూడా తీసేసుకున్నాడు .
మహిళ టైలర్ పై కోర్టులో కేసు వేసింది
అయితే పెళ్లి సమీపిస్తున్నప్పటికీ బ్లౌజ్ మాత్రం సిద్ధం కాలేదు..బ్లౌజు పెళ్లినాటికి తనకు ఇవ్వలేకపోయినందుకు ఆ మహిళ టైలర్ పై కోర్టులో కేసు వేసింది . ఈ కేసు పై విచారణ కూడా జరిగింది . బ్లౌజ్ అనుకున్న సమయానికి ఇవ్వలేక పోయినందుకు తాను పెళ్ళిలో చాలా కష్టపడ్డానని ,శుభకార్యంలో కూడా విచారంగానే ఉన్నానని ,ఆ బ్లౌజ్ వేసుకుని తను పెళ్ళికి పోవాలని భావించానని అయితే తన ఆశలు అడియాసయ్యాయని ఆ మహిళ కోర్టుకు విన్నవించుకుంది.
ఆమె మానసిక వేదనకు నష్టపరిహారం
మహిళలకు ఇష్టమైన డ్రస్సు అది కూడా ముఖ్యమైన శుభకార్యాలలో వేసుకోకపోవడం మనసికంగా వారిని కుంగ తీసినట్టేనని అందువల్ల తనకు కలిగిన మనోవేదనకు టైలర్ నిర్లక్ష్యానికి సమయానికి బ్లౌజ్ ఇస్తానన్న ఒప్పందానికి వ్యతిరేకంగా అతడు ప్రవర్తించినందుకు తనకు నష్టపరిహారం ఇప్పించాలని కోర్టులో పిటీషన్ వేసింది. కోర్టు ఆమె విజ్ఞప్తి మన్నించి బంధువుల పెళ్లిరోజుకు తన అనుకున్న బ్లౌస్ వేసుకోకపోవడం వల్ల ఆమె ఎంత కష్టపడిందో అర్థం చేసుకోగలమని అందువల్ల ఆమె మానసిక వేదనకు, తనకు జరిగిన మానసిక నష్టానికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా డ్రస్ మేకర్ ని ఆదేశించింది .11000 రూపాయలు బ్లౌజ్ మేకింగ్ తో కలిపి చెల్లించమని ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

