ఓ స్నేహితురాలి ఇంట్లో దొంగతనం చేసి చిక్కిపోయిన దొంగ ఎవరో తెలుసా ..? సాక్షాత్తు మహిళా డి.ఎస్.పి . డిఎస్పి స్థాయిలో ఆమె తన స్నేహితురాలు స్నానానికి పోయినప్పుడు ఇంట్లో డబ్బు ,నగలు తీసుకెళ్లిపోయి ఆ తర్వాత సిసిటీవీ ఫుటేజ్ లో చిక్కిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు . ఆ మహిళా డిఎస్పి పరారీలో ఉంది. ఇంతకీ ఈ సంఘటన జరిగింది ఎక్కడో తెలుసా..? మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో జహీంగారబాద్ ఏరియాలో జరిగింది. ప్రమీల అనే మహిళ తన కుటుంబంతో నివసిస్తుంది . ఆమెకు ఇద్దరు బిడ్డలున్నారు. ఆమెతో డిఎస్పీ కల్పనా రఘువంశీ కూడా స్నేహితురాలు . గత కొన్నిఏళ్లుగా వీరిద్దరూ మంచి స్నేహితులు. పరిమళ ఇంటికి కల్పనా చావ్లా తరచూ వెళ్లి వస్తుండేది . ఇటీవల డి.ఎస్.పి కల్పనా , పరిమళ ఇంటికెళ్లింది.
సిసి కెమెరాలో డిఎస్పీ చేతివాటం..
స్నానం చేసి వస్తానని చెప్పి పరిమళ బాత్రూంలోకి వెళ్ళింది . ఇదే అదనగా భావించిన డీఎస్పీ కల్పనా అక్కడే ఉన్న తాళాలు తీసుకుని బీరువాలో ఉన్న రెండు లక్షల రూపాయలు నగదు, ఒక మొబైల్ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయింది . ఆ తర్వాత డబ్బులు లేవని గమనించిన స్నేహితురాలు ఇంట్లో డబ్బు ,నగలు పోయాయని తన స్నేహితురాలైన డీఎస్పీ కల్పనాకి చెప్పింది. అయినా ఆమె పట్టించుకోకపోవడంతో ఆ తర్వాత సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించింది. దీనిలో అసలు విష్యం బయటపడి షాక్ తినింది. డబ్బులు, మొబైల్ ఫోన్ తన స్నేహితురాలు అయినా డిఎస్పీ ఛోరీ చేసి తీసుకుపోవడం చూసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బిడ్డల ఫీజు కోసం బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి పెడితే , స్నేహితురైనా డిఎస్పీ చోరీ చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

