జంతువులకు , క్రిమి కీటకాలుకే కాదు, మనుషులకూ కొన్ని అసాధారణ లక్షణాలు ఉంటాయి . వీటిని మానవాతీత శక్తులు అనే దానికంటే అరుదుగా ఈ అద్భుతమైన శక్తులు జన్యుపరంగా కొంతమందికి అబ్బుతాయి. బహుశా అది వారిలో ఉన్న అంతర్లీన శక్తి కావచ్చు. అలాంటిదే జాయ్ మిల్నే అనే స్కాట్లాండ్కు చెందిన మహిళ జాయ్ మిల్నే ప్రత్యేక లక్షణం. ఈమెకు ఓ విచిత్రమైన ,అద్భుతమైన గుణం ఉంది . అదేంటంటే వృద్ధులకు సాధారణంగా సంక్రమించే పార్కిన్సన్ వ్యాధిని ముందే పసిగట్టగలదు. సమగ్రమైన పరీక్షలకు, స్కానింగ్ ముందే ఈ మహిళ ఆ వ్యాధిని పసిగట్టగలదు .
ఇంకా విచిత్రం ఏమిటంటే తన భర్తకు పార్కిన్సన్ వ్యాధి సోకక రెండు దశాబ్దాలకు ముందే ఈ మహిళ కనిపెట్టిందట . ఈ విషయమై తన భర్తను పదేపదే హెచ్చరికలు చేస్తున్న అతడు లెక్కబెట్టలేదు . చివరకు 20 ఏళ్ల తరువాత అతనికి పార్కిన్సన్ వ్యాధి సోకింది . అప్పట్లో భార్య కోరిక మేరకు కొన్ని దఫాలు టెస్టులు చేసినప్పటికీ అతడికే ఎటువంటి వ్యాధి లేదని డాక్టర్లు తేల్చారు . కానీ ఆమె మాత్రం ఒప్పుకోలేదు . తన భర్తకు పార్కిన్ సన్ వ్యాధి లక్షణాలు శరీరంలో ఉన్నాయని వాదిస్తూ వచ్చింది. అప్పటికీ ఆమెను పిచ్చి దాని కింద లెక్క వేశారు .
ఆ తర్వాత తన బంధు వర్గంలోని కొంతమందికి పార్కిన్ సన్ వ్యాధి రాబోతుందని ఆ లక్షణాలు ఇప్పుడే కనిపిస్తున్నాయని కూడా చెప్పింది . వాళ్ళు అలాగే ముద్రవేశారు . చివరకు ఈమె చెప్పిన వారికి పార్కిన్ సన్ వ్యాధి సంక్రమించింది . జబ్బు రాకముందే ఈ మహిళ, రాబోతున్న జబ్బుని ఎలా చెప్పగలిగిందన్న విషయం ఆమెకు తెలియదు. దీంతో డాక్టర్లు కూడా ఆమెలో ఉన్న ఈ పరిశోధనాత్మక శక్తికి వారు కూడా జోహార్ అనక తప్పలేదు. అందుకే ఆమె సహాయంతో చాలామంది వ్యాధిగ్రస్తులను పరీక్షలు చేసి వ్యాధికి ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం మాంచెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందంలో కూడా ఆమె ఉంది . చర్మంలో సెబుమ్ అనే పదార్థంలో వచ్చే రసాయనాన్ని, దానిలో మార్పులు ఆమె శరీరంలో చెమట వాసన ద్వారా పసికట్టేస్తుందని తేలింది. చర్మం సహజ సిద్ధంగా ఉత్పత్తి చేసే ఆయిల్స్ లో ఈ సెబుమ్ కూడా వాసన చూసే ఆమె పార్కిన్ సన్ వ్యాధి వస్తుందా రాదా అన్న విషయాన్ని చెప్పగలదు . ఇప్పుడు ఆ మహిళ చెప్పిన విషయాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తూ దానిపై పరిశోధనలు చేస్తున్నారు.

