బీహార్ ఎన్నికలలో ఓట్ చోర్ నినాదం బీజేపీకి ఎంతవరకు నష్టం కలిగిస్తుందో ఇంకా పూర్తిస్థాయిలో అంచనాకు రాలేకపోతున్నారు. కానీ రాహుల్ గాంధీ ప్రయోగించిన ఈ అస్త్రం దేశ ప్రజలందరినీ ఆలోచింపచేస్తున్నది. ఓటు చోరీ జరిగిందా లేదా అనేది ప్రక్కకు పెడితే ఎన్నికల సంఘం వ్యవహారశైలి మాత్రం అనుమానాలకు తావిస్తున్నది. ప్రజలకు ఒకసారి అనుమానం వచ్చిందంటే నివృత్తి అవటం కష్టం. ప్రపంచంలోకే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను కోల్పోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనుగడే కష్టం. ఎన్నికల సంఘం లాంటి స్వతంత్ర వ్యవస్థను అనుమానిస్తే భరతమాతను అవమానించినట్లే అని నీతీశ్ లాంటివారు చేసే వ్యాఖ్యానాలు ప్రజల విశ్వాసాన్ని పొందలేవు. మనదేశంలో స్వతంత్ర వ్యవస్థల పనితీరు పైన ప్రజలకు ఎటువంటి భావనలు ఉన్నాయో మనకు తెలియనిది కాదు.
ఎలక్షన్ కమిషన్ అనేది పార్లమెంటుకు, ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి కానీ ప్రభుత్వంతో సంబంధం లేదు. కానీ నియామకం కేంద్రప్రభుత్వం చేతుల్లోనే వుంటున్నది. ఈ నియామకాలు కేంద్రమే చేయటం ఈరోజు కొత్తగా జరుగుతున్నది కాకపోయినా, ఇప్పుడు వస్తున్నన్ని ఆరోపణలు ఎప్పుడూ రాలేదు అనేది వాస్తవం.ఎలక్షన్ కమిషన్ నియామకంలో సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రక్కన పెట్టారు అనేది కొంత అనుమానానికి తావిచ్చింది. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ను నియమించే త్రిసభ్య కమిటీలో ప్రధానమంత్రి, ప్రధానమంత్రి క్యాబినెట్ లోని ఒక మంత్రి, ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉన్నారు. ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరుడు ఒకే మాట పైన వుండే అవకాశం ఉంటుంది, మెజారిటీ నిర్ణయం ప్రకారం అయితే ప్రధాని ఎవరిని అనుకుంటే వారిని నియమించగలుగుతారు.
ఎలక్షన్ కమిషన్. 2024 పార్లమెంట్ ఎన్నికలలో బీహార్ లో ఓట్లు వేసిన వారి నుండి 65 లక్షల ఓట్లు తీసి వేశారు. అప్పటినుండి గొడవ మొదలైంది.ఇది బీహార్ వాళ్లకు మాత్రమే ఇబ్బంది అనుకుంటే పొరపాటు. ప్రస్తుతం దక్షిణభారతంలో సమస్య అంతగా లేదు కానీ ఉత్తర భారతంలో ఈసమస్య ప్రధానంగా వినిపిస్తూనే ఉంది. ఈ సందేహాలకే సమాధానం దొరకక ప్రజలు అనుమానించే దశలో బీహార్లో జరిగిన ఓటర్ల సమగ్ర పరిశీలనలో 65 లక్షల ఓట్లు తీసివేశారు. సుప్రీమ్ కోర్టు తీసివేసిన వారి పేర్లు బహిర్గతం చేయమని పదే పదే కోరగా ఒక లిస్టు సమర్పించారు.. ఈదేశంలో ప్రజాస్వామ్యం దశ ఎటువైపు పయనిస్తున్నదీ అర్థం చేసుకోవటం కష్టం.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

