పెళ్ళైన వారంరోజులకే భర్త హత్యకు ప్లాన్ చేసిన ఇండోర్ కి చెందిన సోనమ్ దుర్మార్గం వెనుక పెళ్ళికి ముందే తనకంటే చిన్న వాడైన యువకుడితో అక్రమసంబంధమే కారణమని తేలింది. తమ దగ్గర పనిచేసే రాజ్ కుష్వాహా అనే 27 ఏళ్ళ యువకుడితో ఆమె సంబంధం పెట్టుకుంది. సోనమ్ కి 32 ఏళ్ళు.. పెళ్ళైన తరువాత తమ అక్రమసంబంధానికి అడ్డుగా ఉంటాడని భావించి ఇద్దరూ కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసారు. అందుకే ఆమె భర్తకు, తనకు మేఘాలయనుంచి రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చెయ్యలేదు. అక్కడే పోలీసులకు అనుమానం వచ్చింది. ముందుగా కిరాయి హంతకులను అరెస్ట్ చేసిన పోలీసుకు , మొత్తం కుట్రను వారే చెప్పేసారు.
సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహాకి ఇంతకుముందే వారితో పరిచయం ఉంది. తనకోసం పోలీస్ వేట ముమ్మరం కావడంతో విధిలేని పరిస్థితుల్లో ఆమె లొంగిపోయింది. మేఘాలయకు హనీమూన్ యాత్రలోనే భర్తను దారుణంగా చంపించిన కిరాతకురాలైన భార్య ఉదంతం దేశంలో సంచలన సృష్టించిన విష్యం తెలిసిందే. ఇండోర్ కి చెందిన సోనమ్ , రఘువంశీకి ఇద్దరికీ గత నెలలో పెళ్లి అయింది.తన కోడలిని కూతురుగా చూసుకుంటే ఇంత నీచమైన పనిచేస్తుందని అనుకోలేదని రఘువంశీ తల్లి కన్నీరుమున్నీరు అవుతొంది.
తన కూతురు అమాయకురాలిని, పోలీసులే అబద్దాలు చెబుతున్నారని బుకాయించిన సోనమ్ తండ్రి ఇప్పుడు మొత్తం కుట్ర బట్టబయలు అయినా తరువాత మాట్లాడకుండా ఉండిపోయాడు.ఒక పధకం ప్రకారమే సోనమ్ భర్తను హానీమూన్ కి తీసుకొచ్చి కిరాయి హంతకులచేత ఇంత ఘోరంగా చంపించడమే సంచలనం అయింది.. కేవలం తమ దగ్గర పనిమనిషితో అక్రమసంబంధం కొనసాగించాలనే ఈ ఘోరానికి పాల్పడింది.

