పెళ్లి అంటేనే మగవాళ్ళు భయంతో వణికిపోయే కాలం వచ్చినట్టు ఉంది . అదేమీ ఖర్మ ఏమోగానీ ఇటీవలకాలంలో భర్తలను చంపేసే భార్యలు, పెళ్లిపేరుతో మోసంచేసి ఉన్నదంతా ఊడ్చుకుపోయే బహుపెళ్ళిళ్ల భార్యల ఉదంతాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఆడజాతికే తలవంపులు తెచ్చే ఈ దుర్మార్గాలు ఇప్పుడు మరో ట్రెండ్ లో జరిగాయి.
సెల్ఫీ పేరుతో భర్తను మభ్యపెట్టి నదిలోకి తోసేసిన భార్య ఉదంతమిది. అతడికి అదృష్టం బాగుండి , బ్రతికి బయటపడ్డాడు. ఒడ్డుకొచ్చి భార్య చేసిన ద్రోహాన్ని అక్కడున్న చెప్పి ఏడుస్తున్నాడు. ఆమె మాత్రం నంగనాచిలా తనకేమీ తెలియదని చెబుతొంది. ఇటీవల పెళ్ళైన భర్తను సెల్ఫీ దిగుదామని నమ్మించి , అతడు వరదనీటిలో రాయిపై ఉండగా భర్తను భార్య నదిలోకి తోసేసిన ఘటన ఇది. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో జరిగిన కొత్తరకం ఘోరం ఇది.
రాయచూర్ జిల్లాకు చెందిన తాతప్పను అతడి భార్య కృష్ణానది వద్దకు తీసుకెళ్లింది. సెల్ఫీ దిగుతామని చెప్పి ఒక్కసారిగా నదిలోకి తోసేసింది. అతడు కొంతదూరం కొట్టుకుపోయి బండరాళ్ల వద్ద ఆగాడు. స్థానికులు గమనించి తాడుతో బయటకు లాగారు. అయితే భర్తే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని భార్య చెబుతుండగా, అతడు మాత్రం తన భార్యే తనను నదిలోకి తోసేసిందని ఏడుస్తూ చెబుతున్నాడు. నమ్మి పెళ్ళిచేసుకుంటే ఇదేమి ఘోరమని ఆవేదన వ్యక్తం చేసాడు. అతనిని కాపాడిన స్థానికులు నచ్చజెప్పినా , తనను చంపాలని చూసిన భార్యతో ఎలాగుండాలని ప్రశ్నిస్తున్నాడు .

