కొంతమంది భర్తల బ్రతుకు భారమవుతొంది. క్షణమొక యుగంలా గడుస్తోంది. భార్యల చేతిలో ప్రాణాలు ఎలా, ఎప్పుడు , ఏ విధంగా పోతాయో తెలియని పరిస్థితి. గత మూడు నెలల్లో దేశంలో వందమందికి పైగా భర్తలను , భార్యలు ప్రియుల్లా సాయంతో చంపేశారు. ఢిల్లీలో మూడు రోజులక్రితం బయటపడ్డ కరణ్ దేవ్ అనే 36 ఏళ్ళ వ్యక్తి హత్య కంపరం కలిగించేదిగా ఉంది. ఇతడిని భార్య సుష్మిత , తన బావ రాహుల్ సాయంతో కరెంట్ షాక్ ఇచ్చి కడతేర్చింది. బావ రాహుల్ తో అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని అతడిని తొలగించుకోవాలని ప్లాన్ చేసింది.
మొదట బావ రాహుల్ చెప్పినట్టు , భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చింది. మూడు గంటలైనా , ఇంకా అతడు మరణించలేదని బావకు మెసేజ్ చేసింది. దీంతో రాహుల్ , మరికొన్ని మాత్రలు నోట్లో పోసి నీళ్లు పొయ్యమని రిప్లై మెసేజ్ చేసాడు. కాసేపటికి నోరు తెరవడం లేదని , ఏం చేయమంటావని మళ్ళీ రాహుల్ కి మెస్సేజ్ చేసింది. దీంతో రాహుల్ కరెంట్ షాక్ ఇచ్చి , పని పూర్తిచేయమని చెప్పాడు. ఆమె అలాగే చేసింది, కరణ్ దేవ్ చనిపోయాడు. ఉదయాన్నే అతడు కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడని , బందువులకు చెప్పింది. ఎవరికీ అనుమానం రాలేదు.
హాస్పిటల్ నుంచి శవాన్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మృతుడి వయసు, మరణించిన పరిస్థితులు అనుమానంగా ఉన్నాయని చెప్పి, పోస్ట్ మార్టం కి పంపించారు. మూడు రోజులక్రితం వచ్చిన రిపోర్ట్ లో ఇది హత్యగా తేలింది. దీంతో భార్య మొబైల్ ఫోన్ సీజ్ చేసి పరిశీలించారు. తమదైన శైలిలో విచారణ చేయడంతో కుట్ర కోణం బయటపడింది. మొబైల్ ఫోన్లో మెసేజ్ లు ఇద్దరినీ పట్టించేశాయి. భార్య అక్రమసంబంధానికి మరో భర్త బలి .అయ్యాడు.

