వంట పాత్రలకు గతంలో కళాయి వేసేవారు. దీన్ని కొన్ని ప్రాంతాల్లో కళాయి అంటారు. మరి కొన్ని ప్రాంతాల్లో కడాయి అంటారు. దీనికోసం ప్రత్యేకమైన పనివాళ్ళు పల్లెలు పట్టణాలు తిరుగుతూ ఇళ్లలో పాత్రలకు కళాయి వేసి పోయేవారు . వంట పాత్రలకు వేసే ఈ కళాయి మనిషి ఆరోగ్యానికి అత్యంత ప్రధానమైనది.. ఏడాదికోసారి కచ్చితంగా కంచు పాత్రలకు కళాయి వేసేవారు.ఈ కళాయి ఎందుకేస్తారన్నది చాలామందికి తెలియదు. అయితే వంట పాత్రలకు ఈ కళాయి పూత ఆధునిక నాగరికత కాలానికి ముందే పూర్వీకుల నుంచే వారసత్వంగా వచ్చింది . పూర్వీకులకు ఎంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు .
కంచు పాత్రల్లో రాగి మరియు జింక్ లోహాలు కలిసి ఉంటాయి. ఈ రెండిటి మిశ్రమమే మిశ్రమమే కంచు . కాలక్రమంలో వంటలు చేసేప్పుడు వచ్చే వేడికి వంటల్లో ఉన్న రసాయనిక పదార్థాలు , కంచు పాత్రలో ఉండే రాగి, జింక్ లోహాలతో రసాయనకి చర్య జరుపుతాయి. అప్పుడు దానికి ఉండే తగరం పూత కరిగిపోతుంది . అలాంటి పరిస్థితుల్లో కళాయి వెలిసిపోయిన పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి హానికరం ఒక రకంగా విషపూరితం. దీన్ని నివారించేందుకే తగరం లోహాన్ని పూతగా ఆ పాత్రల్లో వేస్తారు . ఇది ఆరోగ్యపరంగా మంచిది..వంటల్లో వాడే చింతపండు లేదా ఇతరత్రా మసాలా దినుసులు కూరలు లేదా ఆ పాత్రల్లో పెట్టే ఊరగాయలు కంచు పాత్రలో ఉన్న రాగి మరియు జింక్ లోహాలతో రసాయనికి చేరే జరిపి లోహపు పూతను మాయం చేస్తాయి .
అప్పుడు ఆహారం విషపూరితమవుతుంది . రుచి కూడా మారుతుంది. అందువల్ల కళాయిలేని పాత్రల్లో వండితే ఆహారం రుచి అప్పుడే తెలిసిపోతుంది..పాతకాలంలో భోజనాల పెట్టే కంచు టిఫిన్ క్యారియర్ లో కూడా లోపల కళాయి ఆహారం వాసన వస్తుంది . తినలేని విధంగా తయారవుతుంది . అందువల్ల వంటపాత్రలకు కళాయి వేయించడం అనేది అప్పట్లో ఖచ్చితమైన పద్ధతిగా ఉండేది. ఇప్పుడు ఆధునిక నాగరికతలో అవన్నీ కనుమరుగైపోయాయి . అయితే ఇప్పటికీ కొన్ని సంప్రదాయమైన కుటుంబాలలో కంచుపాత్రల్లోనే వంటచేస్తారు. ధమ్ పెట్టే టీ దుకాణాల్లో ఇత్తడి పాత్రలోనే తీ పెడతారు. వాటికి ప్రతి ఏడాది కళాయిని వేస్తారు. ఇత్తడి పాత్రల్లో వంట చేయడం వల్ల ఆరోగ్యానికి అత్యంత శుభప్రదం అని మంచిదని కూడా ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అయితే తగరంతో దానికి పూత వేసే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని తప్పకుండా పూత వేయించుకోవాలని చెప్తున్నారు
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

