22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

ఏడు కొండలపై ఎందుకు జీవో ఇవ్వాల్సి వచ్చిందో

వెదకపోయిన తీగ కాలికి తగిలిందన్న సామెత ఒకటుంది. ఆ సామెత సంగతేమో కానీ వైసిపి నేతలు వదిలేసిన తీగలన్నీ మెడకు చుట్టుకుంటున్నారు. విడిపించుకునేందికు నానాతంటాలు పడుతున్నారు. దీనికి కారణం సమస్యను ఓక్ విధానం ప్రకారం ఎదుర్కొనే వ్యూహం లేకపోడమే . టిటిడి లడ్డూ వ్యవహారం ఇంత రభసకు కారణం టిడిపి పార్టీ అయినా , దానిని మరింత పెద్దదిచేసి అనవసరంగా మాట్లాడి చిక్కుల్లో పడుతున్నారు. టిటిడి చైర్మన్ గా రెండు సార్లు పనిచేసిన జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి , లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగింది నిజమేనని , అయితే అది కింది స్థాయి అధికారులు చేసిందని చెప్పిన తరువాత కూడా వైసిపి ఎదురీదకుండా మిన్నకుంటే సరిపోయేది.

టిడిపి ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తల్లో వైవి సుబ్బారెడ్డి , తనపై విచారణ జరగకుండా స్తే ఇవ్వాలని సుప్రీం కోర్టులో పిటీషన్ వేయడమే , వైసిపిని ఆత్మ రక్షణలో పడేసింది.సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయకుండా , నానా యాగీ చేసి సమస్యను జటిలం చేసింది,.మధ్యలో ఏడుకొండలు వెంకటేశ్వర స్వామియేనని వైఎస్ రాజశేఖరెడ్డి జిఓ ఇచ్చాడని మరో తలతిక్క ప్రకటన చేసి దాని వెనుక కదా తెరమీదకు తెచ్చారు. ఏడు కొండలు , స్వామికి చెందినవే..లక్షల సంవత్సరాలుగా అవి అలాగే ఉన్నాయి. మరి రాజశేఖరరెడ్డి జిఓ ఇవ్వడమేమిటి..? అసలు ఈ సమస్య ఎందుకొచ్చింది..??

ఏడు కొండలు వెంకటేశ్వర స్వామియేనని ఎందుకు జీవో ఇవ్వాల్సి వచ్చిందో తెరవెనుక చూస్తే మళ్ళీ వైసిపినే ఇరకాటంలో పడింది.. ఇలా వదిలేస్తే పోయే సమస్యను జటిలం చేసింది. ఇవన్నీ పక్కనపెడితే , వైసిపి ప్రభుత్వ హయాంలో లడ్డూ నాణ్యత, అన్నప్రసాదం నాణ్యత తగ్గిందనడంలో ఏ సందేహమూ లేదు. అది నిజం.. అయితే దానికి కారణం ఎవరైనా , ఇది ఇప్పుడు రాజకీయ వివాదం అయింది. అసలే జగన్ క్రెస్తవం మీద , ఆయనకు హిందూ మత సాంప్రదాయాలమీద విశ్వాసంపై చర్చ జరుగుతున్న తరుణంలో వైసిపి ఆచితూచి ముందడుగు వేయకుండా , బురదలో కాలుపెట్టి , టిడిపి ఉచ్చులో పడుతొంది. టిడిపి కూడా దీన్ని సాధ్యమైనంత దూరంలాగి జగన్ ను మతపరమైన ఉచ్చులో పడేయాలని వ్యూహం చేసినట్టు ఉంది.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.