22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

కొడాలి నానికి అసలు సమస్య ఏమిటి..?

మాజీమంత్రి కోడలి నానిని బొంబాయికి అర్జెంట్ గా తరలించాల్సిన పరిస్థితి ఎందుకు కలిగింది..? గత వారం రోజులుగా హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్లో ఉన్న కొడాలి నానిని అక్కడినుంచి ఎందుకు విమానంలో తరలించారన్న విషయంలో స్పష్టత లేకపోయినా , ఒక విష్యం మాత్రం ఆయన అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ అంతర్జాతీయ ప్రమాణాలతో నడిచే హాస్పిటల్. ఎంతోమంది ప్రముఖులు దేశ , విదేశాలనుంచి వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకుంటారు.

అలాంటిది , ఇక్కడనుంచి ఆయనను ముంబైకి తరలించడమే ఆందోళనకు కారణమైంది. కొడాలి నాని మొదట జీర్ణకోశ సంబంధ సమస్యపై హాస్పిటల్లో చేరినట్టు సమాచారం. ఆ తరువాత ఆయనకు గుండె సంబంధ సమస్యలున్నాయని చెప్పారు. సాధారణంగా అయితే ఈ రెండిటికీ అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు అక్కడనుంచి విమానంలో ఆయనను ఎందుకు తరలించారు..? అసలు సమస్య ఏమిటి అన్న విషయమై చర్చ జరుగుతొంది..

 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.