22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

బిజెపికి తక్కువ స్థాయిలో ఓట్లు రావడమే విచిత్రం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణాలో పాగా వేస్తామని ఆశతో ఉన్న బిజెపి నేతలకు జూబ్లీ హిల్స్ ఎన్నిక నిరాశ పుట్టించింది. సాధారణంగా నగరాలలో బిజెపికి ఆదరణ ఉంటుందని భావిస్తారు. అందులోనూ హైదరాబాద్ లాంటి నగరాలలో గతంనుంచి బిజెపికి మంచి ఆదరణే ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా బిజెపి పట్టు హైదరాబాద్ లో బలంగా ఉండేది. అయితే ఇప్పుడు ఉపఎన్నికలో ఆ గెలుపు ఆశలనుంచి మూడో స్థానానికి దిగజారడమే గమనించాల్సిన విషయం. అంటే విద్యావంతులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో బిజెపికి ఇంత తక్కువ స్థాయిలో ఓట్లు రావడమే విచిత్రం. మోడీ బొమ్మ, హిందుత్వ నినాదం ఇక్కడ అసలు పనిచేయలేదని తేలిపోయింది. కనీసం రెండో స్థానంలో గౌరవప్రదమైన ఓట్లతో నిలిచి ఉన్నా పరువు దక్కేది. ఇప్పడు అయిపోయిందనుకున్న బిఆర్ఎస్ గతంలోకంటే మెరుగుపడే రీతిలోనే ఓట్లు సంపాదించింది.

బిఆర్ఎస్ పతనం తమకు వరం అవుతుందనుకుంటే

బిఆర్ఎస్ పతనం తమకు వరం అవుతుందనుకుంటే , అది తల్ల కిందులయింది . బిజెపి ఆశలు అడియాసలు అయ్యాయి. ఇటీవలకాలంలో తెలంగాణ బీజేపీలో లుకలుకలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో అందరూ ఒక్కటయ్యారు. మిగతా రెండు పార్టీలతో సమానంగా డబ్బు కూడా ఖర్చు చేసారు. చివరకు మూడో స్థానంతో ఓటమి తప్పలేదు.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి 25 వేల ఓట్ల పైగా మెజారిటీ వచ్చింది.. ఉపఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీ గెలుస్తుందన్న వాదన ఉన్నప్పటికీ మిగిలిన రెండు పార్టీలకు, గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ఓట్ల ఆధిక్యంలో చాలాతేడా ఉంది. అదే ఈ ఎన్నికల్లో , ఫలితాల్లో విశేషం . ఈ ఉప ఎన్నిక గెలుపు పార్టీలో రేవంత్ రెడ్డి స్థానాన్నికూడా పటిష్టం చేసింది..

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.