విమానాల ప్రమాదాలు సమయంలో తరచుగా బ్లాక్ బాక్స్ అన్న పదం వినిపిస్తూ ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ లో విమాన ప్రమాద సమయంలో ప్రమాదానికి కారణాలను, ప్రమాదం జరిగే సమయంలోనూ, దానికి ముందు ఏమి జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానం ఎంత ఎత్తులో ఉంది? ఎంత వేగంతో పోతుంది?? అన్న వివరాలను, కంట్రోల్ రూమ్ తో పైలెట్లు మాట్లాడిన సంభాషణ, వీటన్నిటిని కూడా ఈ బ్లాక్ బాక్స్ లోనే ఉంటాయి.
కాక్ పిట్ లో ప్రతి సంభాషణ బ్లాక్ బాక్స్ లోనే ఉంటుంది. విమానం ప్రయాణం, అప్పటి ప్రతి వివరము బ్లాక్ బాక్స్ లో ఉంటుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బ్లాక్ బాక్స్ దెబ్బతినకుండా అత్యంత సురక్షితంగా ఉండే విధంగా రూపొందిస్తారు. విమానం తయారీ సమయంలోనే దీనికోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సాధారణంగా ఈ బ్లాక్ బాక్స్ లో ప్రతి వివరం, కాక్ పిట్ లో పైలెట్లు మాట్లాడుకునే ప్రతి సంభాషణ, కంట్రోల్ రూమ్ తో మాట్లాడిన వివరాలు, ఇతర టెక్నికల్ వివరాలన్నింటినీ కూడా తోక భాగంలో ఉండే ఒక సురక్షితమైన ప్రాంతంలో ఉండే బ్లాక్ బాక్స్ లోకి చేరుకుంటాయి.
ఒకవేళ విమానం అగ్ని ప్రమాదానికి గురైనా లేదా సముద్రంలో పడిపోయినా లేదా ఇతర ఇంకా ఏదైనా ప్రమాదం సంభవించినా ఆ ప్రమాదాలు ప్రభావం ఈ బ్లాక్ బాక్స్ మీద పడకుండా చూసుకుంటారు. సముద్రంలో పడిపోయినప్పుడు సముద్రంలో నీటి ఒత్తిడికి బ్లాక్ బాక్స్ చెడిపోకుండా దాన్ని తయారుచేస్తారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్ని ప్రమాదం తీవ్రతకు బ్లాక్ బాక్స్ దెబ్బతినకుండా దాన్ని రూపొందిస్తారు. ఒకవేళ భూమి మీద కూలిపోయినప్పుడు ఆ ధాటికి బ్లాక్ బాక్స్ దెబ్బతినకుండా ఉండేవిధంగా బ్లాక్ బాక్స్ను తయారుచేస్తారు. ఎందుకంటే విమాన ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు బ్లాక్ బాక్స్ ఒకటే ఆధారం.
దీంట్లోనే కాక్ పిట్ వాయిస్ రికార్డర్ ఉంటుంది.అంటే పైలెట్, అసిస్టెంట్ పైలెట్ వీళ్ళందరూ ఉండే కాపీట్ నుంచి కంట్రోల్ రూమ్ కి జరిగిన సంభాషణలు అన్నీ కూడా వాయిస్ రికార్డర్ లో నిక్షిప్తం అయ్యి ఉంటాయి. అలాగే ఎఫ్ డి ఆర్ అంటే ఫ్లైట్ డేటా రికార్డర్ కూడా బ్లాక్ బాక్స్ లో ఉంటుంది. దీనిలో విమానానికి సంబంధించిన వేగం, ప్రమాదం సమయంలో భూమి నుంచి అది ఉన్న ఎత్తు, ఇంజిన్ లోని భాగాలు పనితీరు ఇలాంటివి అన్ని కూడా ఫ్లైట్ డేటా రికార్డుల్లో నిక్షిప్తం అయిఉంటాయి .
ఇప్పుడు అహ్మదాబాద్, లండన్ విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్సులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ఇప్పుడు పరిశీలించి ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగింది అన్న విషయాన్ని కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

