ఎత్తైన కొండల్లో పూర్వకాలంలో కోటలు కట్టేవారు, దాదాపు కట్టిన కోటలన్నీ కొండల మీదనే .. ఆ కోటలోని రాజులు, రాణులు, రాజభవనాలు సైనిక సైనిక స్థావరాలు ఇలా అనేక భవనాలు ఉండేవి. వారికోసం దేవాలయాలు, ఆ తర్వాత మొఘల్స్ దురాక్రమణలో మసీదులు, దర్గాలు ఇలా ఏర్పడ్డాయి. అయితే కొండల మీద ఉన్న రాజభవనాలకు మంచినీటి సరఫరా ఎలా అనేది ఒక ఒక ప్రశ్న . కొండల్లో కోనలు ఉంటాయి. వర్షాకాలంలో కోనలనుంచి మంచినీటిని మళ్లించుకునే వాళ్ళు . ఆ తర్వాత భూమి మీద నుంచి ఆర్కిమెడిస్ సూత్రం ద్వారా మంచినీటిని దశలవారీగా కొండలపైకి మళ్ళించుకునేవారు.
అయితే భూమ్మీద కూడా నీళ్లు లేనప్పుడు, కొండలపై కోనలు ఎండిపోయినప్పుడు పైన నీళ్లు ఎలా చేసేవారు అన్న ప్రశ్నకు ఇదే సమాధానం .కొండల్లో రాళ్లు రప్పలు చెట్ల మధ్య నుంచి ఇలా బొట్లు, బొట్లుగా నీటిధారలు పడేవి . వీటిని నిలువ చేసుకునేందుకు రాతి తొట్టెలు కూడా ఉంచేవారు. ఎక్కడెక్కడించో రాళ్ళను తొలుచుకుంటూ ,చెట్ల వేళ్ల మధ్య నుంచి ఈ నీళ్లు ఇలా బొట్లు బొట్లుగా పడి రాతి తొట్టిలు నిండేవి. ఆ వీటిని తాగునీటిగా ఉపయోగించే వారిని చరిత్ర చెప్తోంది.
ఈ నీళ్లు అపురూపం, అమోఘం, అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. రాళ్లలో నుంచి చెట్ల వేర్లలో నుంచి పారుతూ వచ్చేవి కాబట్టి వాటిలో ఉన్న ఖనిజ లవణాలు, పోషక పదార్థాలు అన్నిటిని కూడా కలబోసుకుని ఈ నీరు వస్తుంది. వీటిని ఔషధంగా కూడా వాడుకునేవారు. ఇప్పటికీ ఉదయగిరి కోట కొండ కోనల్లో ఇలాంటి దృశ్యాలను చూడవచ్చు.

