22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

జగన్, మారింది నువ్వు, నేను కాదు గుర్తుపెట్టుకో

వైసీపీ మాజీ నేత ,మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పై జగన్ చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. తాను మారిపోయానంటూ, చంద్రబాబుకు లోపాయి కారీగా సహకారం సహాయం అందిస్తున్నానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం ధీటుగా, ఘాటుగానే ఇచ్చారు. మారింది నేను కాదు జగన్ ,నువ్వే.. అధికారం వచ్చిన తర్వాత నువ్వే మారిపోయావు .. అంటూ ట్వీట్ చేసారు. నేనెప్పుడూ మారను ,నా వ్యక్తిత్వం ఎప్పుడు ఇలాగే ఉంటుంది , పదవి వచ్చిన తర్వాత ఒకరకంగా, పదవి రాకముందు ఇంకో రకంగా ఉండేవాడిని కాదు. ఎప్పుడూ ఇలాగే ఉంటాను. ప్రలోభాలకు లొంగను. ఎవరికీ భయపడను . విశ్వసనీయత కోల్పోను. అంటూ ఘాటుగానే సమాధానం చెప్పారు.

గతంలో నాయకుడి మీద ఎంతో విశ్వాసంగా ఉన్నాను, దేవుడు పై కూడా విశ్వాసమే.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను, కారణం మీకు తెలుసు, బాధలు భరించలేక తప్పుకున్న, పార్టీ నుంచి తప్పుకున్న తర్వాత ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలు సిట్ కు విజయసాయిరెడ్డి అందించారన్న ప్రచారం కూడా ఉంది. ఐదేళ్లపాటు వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరించి, అనేక వివాదాలకు కేంద్రబిందువై ,అనేక రకాలుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించి, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులలో ఒకడుగా ప్రచారం పొందిన విజయ సాయి రెడ్డి, పార్టీ నుంచి తప్పుకోవడం, ఎంపీ పదవి కూడా రాజీనామా చేయడం, జగన్ పై పరోక్షంగా విమర్శలు సందించడం విశేషం.

అవినీతి కేసులో గతంలో జగన్మోహన్ రెడ్డి తో పాటు విజయ సాయి రెడ్డి కూడా 16 నెలలు జైల్లోనే ఉన్నారు. అలా గత కాలంలో అవి నేరాలైనా ఘోరాలైనా, రాజకీయాలైనా, ఇద్దరు కలిసే చేశారు . కలిసి శిక్షలు అనుభవించారు. అయితే ఇప్పుడు కారణాలు ఏవైనా అంతఃపుర రహస్యాలు ఎలాగున్నా, విజయ్ సాయి రెడ్డి బయటపడి మెల్లిమెల్లిగా జగన్ ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. చివరకు ఇది ఎక్కడికి పోతుందో చూడాలి..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.