ప్రపంచంలో చాలా వింతలు ఉన్నాయి..నమ్మలేని అద్భుతాలున్నాయి. మనకు తెలిసినవి కొన్నే.. సృష్టి మహత్యం ఏమిటో గాని నడిచే చెట్టుందని చాలామందికి తెలియదు.. ఇదేదో జానపద కథల్లో , సినిమాల్లో చూసే సన్నివేశం కాదు .. దృశ్యం కాదు .. ఇది నిజం.. సృష్టి మహత్యానికి, రహస్యానికి ఒక ఉదాహరణ.. నడిచే ఆ చెట్టు పేరు సోక్రటీయా ఎగ్సోరిజా .. ఈ చెట్టు దక్షిణ అమెరికాలోనూ మధ్య అమెరికాలోనూ వృక్షశాస్త్రంలో ఒక అద్భుతం. ఇది అమెజాన్ అడవుల్లో ఉంటుంది.. ఏడాదికి 65 అడుగులు కదులుతుంది.. తనకు అనుకూలమైన వాతావరణం కోసం దీని ప్రయాణం ఇలా సాగిపోతుంది.
ఇతర చెట్ల మాదిరి ఈ చెట్టు వేర్లు భూమిలోకి పాతుకొని ఉండవు . అవి నేల మీద నుంచి ఒక రకమైన నిర్మాణం లాగా ఈ చెట్టు పైకి పెరుగుతుంది . అదే ఈ చెట్టు రహస్యం . అందువల్లనే ఈ చెట్టు వేళ్ళు కదలిక వీలవుతుంది. వెలుతురు ,సారవంతమైన భూమి కోసం ఇది కదులుతుంది.. కాలం గడిచే కొద్ది పాతవేర్లు నాశనమై కొత్తవేర్లు పుడుతుంటాయి. అయితే ఈ వేర్లు కూడా ఆ చెట్టు కదిలే దిశగానే పుడతాయి. ఇది తన దిశను చాలా నేర్పుగా మార్చుకోగలదు . కేవలం బ్రతికే దానికే ఈ చెట్టు ఇలా కదులుతుందని వృక్ష శాస్త్రవేత్తలు చెప్తారు. అమెజాన్ అడవుల్లో ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో ఈ చెట్టు ఇలా పెరిగిందని అంటారు.. కాకులు కూడా దూరలేని కారడవుల్లో ఉండే ఈ చెట్లు చూసేందుకు శాస్త్రవేత్తలు అతి కష్టం మీద పోగలరు..

